నాని ‘ అంటే సుంద‌రానికి ‘ ఫ‌స్ట్ డే సూప‌ర్బ్ వ‌సూళ్లు..!

నాచురల్ స్టార్ నాని హీరోగా క‌రోనా టైంలో వీ, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రావడంతో అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేదు. పైగా నాని మార్కెట్ కూడా త‌గ్గింది. అయితే చివ‌రిస సినిమా శ్యామ్ సింగ రాయ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా హిట్ అయినా కూడా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉండ‌డంతో అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు రాలేదు.

ఇక తాజాగా అంటే సుంద‌రానికి సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా శ్యామ్ సింగ రాయ్ కి పూర్తి భిన్నంగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసిన ఈ సినిమాతో మళయాళ బ్యూటీ నజ్రియా తెలుగులో హీరోయిన్గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వ‌స్తోంది.

అటు ఓవ‌ర్సీస్‌లో కూడా పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్ తో ఫస్ట్ డే స్టార్ట్ చేసుకుంది. ఈ సినిమా ప్రీమియర్స్ తో 2 లక్షల డాలర్స్ మార్క్ క్రాస్ చేసి అదరగొట్టింది. ఎలాగో అక్కడ పాజిటివ్ టాక్ రావ‌డంతో పాటు క్లాస్ సినీ ల‌వ‌ర్స్‌ను మెప్పించే సినిమా కావ‌డంతో పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌దు. సినిమాకు లాంగ్ ర‌న్లో మంచి వ‌సూళ్లు వ‌స్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Share post:

Popular