త్రివిక్ర‌మ్ – మ‌హేష్ మూవీ రెమ్యునరేష‌న్లు.. బిజినెస్‌తో మైండ్ బ్లాకింగే…!

అల వైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ సినిమా వ‌స్తోంది.. అది కూడా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో..! మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత‌.. ఖ‌లేజా త‌ర్వాత ఈ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో అత‌డు, ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి.

అయితే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఈ సినిమాకు బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకు కోట్ చేస్తోన్న రేట్లు మాత్రం చుక్క‌లను చూపించేలా ఉన్నాయి. అస‌లు హారిక – హాసిని వాళ్లు ఏ ధైర్యంతో ఈ రేట్లు చెపుతున్నాయో తెలియ‌క ప్ర‌తి ఒక్క‌రు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఓవ‌ర్సీస్ రైట్స్ కోస‌మే ( అమెరికా స‌హా అన్ని దేశాలు) ఏకంగా రు. 25 కోట్లు కోట్ చేస్తోంద‌ట‌.

అయితే ప్ర‌స్తుతం ఓవ‌ర్సీస్ బిజినెస్ లో టాప్ ప్లేసులో ఉన్న ఓ సంస్థ మాత్రం సింగిల్ హోల్ సేల్‌గా రు. 20 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింద‌ట‌. అయితే థియేట‌ర్ బిజినెస్‌తోనే రు. 130 – 140 కోట్లు లాగేయాల‌ని వాళ్లు అనుకుంటున్నారు. ఆంధ్ర 40, నైజాం 40, సీడెడ్ 15, ఓవర్ సీస్ 25, కర్ణాటక, ఇతర ప్రాంతాలు ఇలా అన్నీ కలిపి 130 నుంచి 140 కోట్లు రాబట్టాలని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇక ఆడియో రైట్స్ 15 – 20 కోట్ల రేషియోలో ఉంది. హిందీ రైట్స్ కింద 30, డిజిటల్..శాటిలైట్ కింద 50 ఇలా పెద్ద పెద్ద అంకెలు చెపుతున్నారు. ఓవ‌రాల్‌గా రు. 250 కోట్ల బిజినెస్ అంటున్నారు. మ‌రి రాజ‌మౌళి సినిమాలు వ‌దిలేస్తే మ‌రే సినిమాల‌కు ఈ రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గ‌లేదు. వీరి అంచ‌నాలు, క‌లలు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.

Share post:

Popular