రవితేజ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అస్సలు నమ్మలేరు ?

సినిమాలలో మంచి పాత్రలు చేసి చాలా పాపులర్ అయిన హీరోయిన్ లు ఎందరో ఉన్నారు. అయితే వీరు టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సినిమాలకు పరిమితం అయ్యి ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అదే విధంగా ఒక హీరోయిన్ ఇప్పుడు తెరమెరుగైపోయింది. ఆమె ఎవరో కాదు రవితేజ నటించిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న మలయాళ కుట్టి గోపిక. ఈ సినిమా తరువాత లేతమనసులు మరియు యువసేన లో నటించింది. అయితే ఈ సినిమాలు చేసిన ఈ మల్లేశ్వరి మళ్ళీ మన తెలుగు సినిమా ప్రేక్షకులకు కానరాలేదు. అయితే ఇప్పుడు గోపిక ఎక్కడ ఉంది. ఏమి చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం.

మాములుగా గోపిక చిన్నప్పటి నుండి ఎయిర్ హోస్టెస్ కావాలని అనుకుందట. కానీ విధి గీసిన రాతలో పడిపోయి అనుకోకుండా సినిమాలలోకి వచ్చింది. ఈమె తన స్వంత ఇండస్ట్రీ మలయాళంలో నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈమె తెలుగు మలయాళ భాషలలో దాదాపుగా 30 సినిమాలలో నటించి ఆ తర్వాత మాయమైంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కెరీర్ మంచి ఊపుమీద ఉన్నప్పుడే ఐర్లాండ్ కు చెందిన అజిలీస్ చాకు అనే డాక్టర్ ను పెళ్లి చేసుకుంది. దానితో సినిమా రంగానికి గోపికకు ఋణం తీరిపోయింది. ఈ దంపతులకు ఒక కొడుకు మరియు కూతురు సంతానంగా ఉన్నారు. అయితే అందరికీ దూరంగా ఉన్న గోపిక మొన్న వచ్చిన కరోనా సమయంలో తన గురించి తెలియచేస్తూ తాజా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ ఫొటోస్ చుసిన తన ఫ్యాన్స్ మరియు సినిమా రంగానికి చెందిన వారు షాక్ అవుతున్నారు.

గోపికకు అందరిలాగే సినిమా రంగానికి చెందిన వారు అంటే చాలా ఇష్టమట… వారిలో సొంత ఇండస్ట్రీ అయిన మలయాళంలో స్టార్ హీరోలుగా ఉన్న మోహన్ లాల్ మరియు మమ్ముట్టి లు అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లోనూ పరిచయం అయింది కాబట్టి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం అని గతంలో చెప్పింది. అంతే కాకుండా ఒకానోక ఇంటర్వ్యూలో గోపిక నేను చేసిన నటనను నచ్చి ప్రజలు నన్ను కొన్ని సినిమాలలో ఆదరించారు అని గొప్పగా చెప్పుకుంది. అయితే ఇక ముందు అయినా ఈ గోపిక సినిమాలలో ఏదో ఒక ప్రధాన పాత్రలో నటిస్తుందా అని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి వారి కోరిక తీరుతుందా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Share post:

Popular