కమల్ హాసన్ ” విక్ర‌మ్‌” మూవీ రివ్యూ ..హిట్టా ….ఫట్టా?

టైటిల్‌ : విక్రమ్
నటీనటులు : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్‌
సినిమామాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్ : ఫియోమిన్ రాజ్
నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్
ర‌చన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
విడుదల తేదీ : జూన్ 3, 2022

ఖైదీ, మాస్టర్ లాంటి యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేసిన దర్శకుడు లోకేష్ కనగారాజ్. ఈ క్ర‌మంలోనే మూడో ప్ర‌య‌త్నంగా లోక‌నాయ‌కుడు కమల్‌హాసన్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్‌లతో తెర‌కెక్కించిన సినిమా విక్ర‌మ్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ సినిమా భారీ అంచ‌నాలు అందుకుందో ? లేదో ? చూద్దాం.

స్టోరీ :
మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠా వరుస హత్యలకు పాల్పడే ముఠా పోలీసు అధికారి ప్రభంజన్‌, అతని తండ్రి కర్ణణ్‌(కమల్‌ హాసన్‌) కూడా చంపేస్తుంది. ఈ ముఠాను ప‌ట్టుకునేందుకు స్పై ఏజెంట్‌ అమర్‌(ఫాహద్‌ ఫాజిల్‌) వ‌స్తాడు. ఈ విచార‌ణ‌లో ప్రభంజన్‌ హత్య వెనుక డ్రగ్స్‌ మాఫీయా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) ఉన్నాడ‌ని.. క‌ర్ణ‌న్ చ‌నిపోలేద‌న్న విష‌యం తెలుస్తుంది. క‌ర్ణ‌న్‌కు ఏజెంట్ విక్ర‌మ్‌కు ఉన్న లింక్ ఏంటి ? డ్రగ్స్‌ మాఫియాను అరికట్టేందుకు కర్ణణ్‌ వేసిన ప్లాన్‌ ఏంటి? ఈ కథలోకి సూర్య ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనేది తెలియాలంటే విక్రమ్‌ సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
ఇదో స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌. యాక్ష‌న్ స్టైలీష్ సినిమాలు తెర‌కెక్కించడంలో లోకేష్ క‌న‌క‌రాజ్ శైలీ వేరు. ఆ అంచ‌నాల‌కు అనుగుణంగానే విక్ర‌మ్ క‌థ‌ను మ‌నోడు తెర‌కెక్కించాడు. కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ లాంటి దిగ్గజ నటులను బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాను స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపించాడు. ఫస్టాఫ్‌లో సాదా సీదాగా అనిపించిన సీన్లను సెకండాఫ్‌కు ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో యాక్ష‌న్ డోస్ ఎక్కువ‌.

67 ఏళ్ల వ‌య‌స్సులోనూ కమ‌ల్ అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్‌తో కమల్‌ చేసే ఫైట్స్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌. ఇక స్పై ఏజెంట్‌ అమర్‌గా ఫహద్‌ ఫాజిల్‌ మంచి నటనను కనబరిచాడు. క్లైమాక్స్‌లో సూర్య ఎంట్రీ బాగుంది. టెక్నిక‌ల్గా అన్ని విభాగాలు బాగా ప‌నిచేశాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాలు చూసే వారితో పాటు స‌గ‌టు సినీ ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

విక్ర‌మ్ రేటింగ్ : 2.5 / 5