ఎన్టీఆర్ అభిమానులకు ఎదురుచూపులేనా.. అసలు విషయం ఏమిటంటే..?

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా RRR చిత్రం తో పాన్ ఇండియా సినిమా ల వల్ల పేరు పొందడమే కాకుండా అభిమానులను సైతం మెప్పించిన ఘనత ఈయనకే దక్కింది.. దీంతో ఎన్టీఆర్ నటించబోయే తన తదుపరి చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదాపడుతూ వస్తోంది. అరవింద సమేత తర్వాత RRR చిత్రం కోసం మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నారు. ఇక అందుచేతనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని వెంటనే పూర్తి చేయాలని భావించారు.

కానీ అంతలోనే డైరెక్టర్ కొరటాల శివకు ఆచార్య సినిమా ఎఫెక్ట్ పడడంతో కాస్త అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చిరంజీవి కూడా ఆచార్య సినిమా మా ఫ్లాప్ అయిన కారణంగా ఆ సినిమా సెటిల్మెంట్ విషయంలో చాలా సతమతమవుతున్నట్లు గా సమాచారం. దీంతో ఎన్టీఆర్ సినిమాలోని స్క్రిప్టు లో పలు మార్పులు చేయబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే జనతాగ్యారేజ్ వంటి ఒక మంచి కథను ఎంచుకొని సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు శివ.

ఆచార్య సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కొరటాల శివ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా భారీగానే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఏమిటంటే అంత భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎంతవరకు డీల్ చేయగలరు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కొరటాల శివ .. ఎన్టీఆర్ స్టామినాకు తగ్గట్టుగా మంచి కథ ను రెడీ చేసుకోవాలని అభిమానులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అనుకున్నట్లుగా అన్నీ జరిగి ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పూర్తి కావాల్సి ఉండేది. కానీ ఇప్పటివరకు సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాలేదు అన్నట్లుగా సమాచారం. దీంతో చాలా కాలం పాటు ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూడక తప్పటం లేదన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక మరొకవైపు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమాను తెరకెక్కించే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అటు ఇటు గా కొరటాల శివ కంటే ముందు ఎన్టీఆర్ ఈ డైరెక్టర్ తోనే సినిమా పూర్తిచేసినా ఆశ్చర్యంలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Share post:

Popular