ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్..ఆ స్పెషల్ ప్లేస్ లోనే..!!

టాలీవుడ్ టాప్ హీరో ఎవరయ్యా అంటే కళ్లు మూసుకుని అందరు టక్కున్న చెప్పే పేరు..జూ NTR. ఈ మాట కేవలం అభిమానులు మాత్రమే చెప్పింది కాదు.. సినీ ప్రముఖులు సైతం అదే మాట అంటున్నారు. తాతకు తగ్గ మనవడు అని..అన్ని రకాల పాత్రలకు సెట్ అవుతాడని…గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్ని ఆయనలో ఉన్నాయని చెప్పుతున్నారు. రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న NTR..ఆ తరువాత వరుస సినిమాలకి కమిట్ అయ్యి పోయాడు.

కొరటాల శివ తో NTR30..ఈ సినిమా తరువాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా..ఈ రెండు సినిమాలు అయిపోయాక బుచ్చి బాబు, అనిల్ రావిపూడి లతో మరో రెండు సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి. దీంతో వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే, ఫ్యామిలీ కి టైం ఇవ్వలేం అని డిసైడ్ అయ్యి..సరదాగా కొద్ది రోజులు భార్య పిల్లలితో గడపడానికి సింగపూర్ వెళ్ళాడు NTR. నిజానికి సింగపూర్ అంటే NTR కంటే ఆయన భార్య లక్ష్మి ప్రణతికి బాగా ఇష్టమట..అందుకే ఆ స్పెషల్ ప్లేస్ కే తనని తీసుకెళ్లిన్నట్లు ఫోటోల బట్టి తెలుస్తుంది. కేవలం తన ఫ్యామిలీనే కాకుండా..దగ్గర ఫ్రెండ్స్ , సన్నిహితులు కూడా వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తారక్ అక్కడ సరదాగా గడుపుతున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. NTR క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన విదేశాలల్లోను ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అక్కడ తారక్ ని చూసిన వారు సెల్ఫీ, ఆటో గ్రాఫ్ అంటూ సందడి చేశారు. దీంతో వాళ్ళు దిగ్గిన ఫోటోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. సింగ‌పూర్‌లోని ప్ర‌ముఖ TSMB మాల్‌లో ఎన్టీఆర్‌ సందడి చేసారు. ఫ్రెండ్స్ తో సరదాగా గడిపారు. ఇక అక్కడే ఉన్న NTR తెలుగు ఫ్యాన్స్ తారక్ తో ఫోటోలు దిగారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ సింగపూర్ మాల్ లో చిల్ అవుతున్న ఫోటోలు, అక్కడ ఫ్యాన్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Popular