ఎన్టీఆర్ వదులుకున్న ఫ్లాప్, హిట్ చిత్రాలు ఇవే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ నటుడి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ మొదట డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఆది, సింహాద్రి వంటి తదితర చిత్రాలలో నటించాడు. దీంతో ఒక్కసారిగా స్టార్ డమ్ ని అందుకున్నారు ఎన్టీఆర్.

అప్పటి స్టార్ హీరోలైన బాలకృష్ణ ,చిరంజీవి, వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు కూడా ఎన్టీఆర్ క్రేజ్ ను చూసి భయపడే వారట. ఇక ఆ తరువాత ఎన్నో ఫ్లాప్ లను చవిచూశారు ఎన్టీఆర్. కానీ టెంపర్ చిత్రంతో తన నటనని పూర్తిగా మార్చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగిందట . వాటిలో కొన్ని చిత్రాలు మంచి విజయాలను అందుకోవడం.. మరి కొన్ని చిత్రాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నితిన్ హీరోగా, వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన దిల్. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఆర్య సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే చిత్రం కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. బోయపాటి రవితేజ కాంబినేషన్లో వచ్చిన భద్ర చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక వీటితో పాటే కృష్ణ, శ్రీమంతుడు, ఎవడు, ఊపిరి తదితర హిట్ చిత్రాలను వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఈ చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.

అయితే బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శ్రీనివాస కళ్యాణం చిత్రాలను కూడా ఎన్టీఆర్ వదులుకొని మంచి పని చేశారు.

Share post:

Popular