బాలయ్యతో ఈ యంగ్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ…!

బాలయ్యతో సినిమా చేయాలి అంటే దర్శకుడు పూర్తిస్థాయిలో పరిపక్వత చెంది ఉండాల్సిందే అని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో మొదటి సారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ.

ఇక ఈ సినిమా ప్రశాంత్ వర్మ కు కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వకపోయినా స్టార్ హీరోయిన్స్ తో చేసిన ప్రయోగం అందరిని మెప్పించింది. ఈ సినిమాతోనే తెలుగు పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయినా.. తన నెక్స్ట్ సినిమాతోనైనా ప్రశంసలు అందుకోవాలని ఆలోచించి..ఆయన కష్టపడి.. పూర్తి మనసుపెట్టి రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.

ఇక అలాగే ఇంద్ర సినిమాలో బాలనటుడిగా నటించిన తేజ సజ్జా ని కూడా హీరోగా పరిచయం చేస్తూ జాంబి రెడ్డి సినిమాను తీసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈయన డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మాస్ ఆడియెన్స్ థియేటర్స్ కి రావాలి అంటే మాస్ ఫార్ములా వెంట పడకుండా హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో అదే తరహా కథలతో సినిమాలు తీస్తూ సత్తా చాటాడు.

హై టెక్నికల్ వాల్యూస్ తో ఇంత చిన్న ఏజ్ లోనే సినిమాలు తీసి మెప్పించడం అంటే చాలా కష్టం అని చెప్పాలి . కానీ ఈయన మాత్రం అవలీలగా చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా హను మాన్ అని ఒక హై టెక్నికల్ వాల్యూస్ సినిమాను తేజ సజ్జా ను పెట్టి ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమా తీస్తున్నాడు. ఇకపోతే బాలయ్యబాబు ఆహా లో చేసిన అన్ స్టాపబుల్ షో కి కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కావడం గమనార్హం.

తన టాలెంటు తో మంచి విజయం సాధించినందుకు మంచి కథ రెడీ చేసుకోమని సినిమా చేద్దామని బాలయ్య ప్రశాంత్ వర్మ కు మాట ఇచ్చారట. టాలెంట్ ఎక్కడుంటే అక్కడ బాలయ్యా అవకాశం ఇస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నట్లు ఒక గొప్ప సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హాలీవుడ్ తరహాలో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular