హవ్వా..తనకంటే పెద్ద వయసు హీరోయిన్ తో రొమాన్స్ కు సిద్ధపడినా మహేశ్..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు..ఏం చేసినా ఓ ప్లానింగ్..ఓ పద్ధతి ఉంటుంది. ఆయన సినిమా స్టోరీ వినేటప్పుడు నుంచి..సినిమా సక్సెస్ మీట్ వరకు..అన్ని పనులు ఓ పక్కా ప్రణాలికలో వెళ్తుంటాడు. హడావుడి పనులు..కాంట్రవర్షీయల్ కామెంట్స్ జోలికి అస్సలు వెళ్ళడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ లాంటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ హీరో..త్వరలోనే సినిమాను సెట్స్ పై కి తీసుకెళ్ళనున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే..దర్శకధీరుడు రాజమౌళి తో మరో ప్రతిష్టాత్మకతమైన సినిమాకు కమిట్ అయ్యాడు. చాలా సంవత్సరాల నుండి మహేశ్-జక్కన్న కాంబోలో ఓ సినిమా కావాలని..అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఫైనల్ గా అది నిజమైంది.

ఈ సినిమా అఫ్రికా అడవుల నేపధ్యంలో వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యిన్నట్లు టాక్ వినిపిస్తుంది . వచ్చే ఏడాది మొదటి నెలలో ఈ సినిమా షూటింగ్ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారట జక్కన్న. కాగా , ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది బడా హీరోయిన్స్ పేరులు వైరల్ అవ్వగా..ఫైనల్ గా ఐశ్వర్య రాయ్ ని ఫిక్స్ చేశాడట రాజమౌళి. ఇప్పటికే ఐశ్వర్య కు సినిమా లైనప్ వినిపించిన రాజమౌళి స్టోరీకి.. ఆమె కుడా యస్ చెప్పిన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, మహేశ్ కన్న ఐశ్వర్య రెండేళ్లు పెద్దది.. చూడటానికి కూడా ఇప్పుడు ఐశ్వరయ రాయ్ కొంచెం బొద్దుగా కనిపిస్తూ…ఓల్డ్ లుక్ తెలుస్తుంది. రీసెంట్ కెన్స్ ఫోటో షూట్ లల్లో ఆమెను చూసిన జనాలు అదే అన్నారు. మరి ఇలాంటి బ్యూటి మహేశ్ పక్కన సెట్ అవుతుందా అనేదే డౌట్..మరి చూడాలి రాజమౌళీ ఏం నిర్ణయం తీసుకుంటాడో..?

Share post:

Popular