ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుందంటే..?

ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుంది..ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయండంలో సందేహమే లేదు. డైరెక్షన్‌లో అనుభవం అంతగా లేకుండా శివ లాంటి సంచలనాత్మకమైన సినిమాను తీసి ఇండస్ట్రీలో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆర్జీవీ కెరీర్‌లో అలాగే అక్కినేని నాగార్జున కెరీర్ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా శివ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఓ స్వీట్ మెమరీ.

ఈ ఒక్క సినిమా ఆర్జీవీ కెరీర్‌ను చాలా వరకు కాపాడుతూ వస్తుందంటే దాని ప్రభావం ఇంకా ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఈ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్నీ భాషలలో మేకింగ్‌లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా కట్ టు కట్ షాట్ డివిజన్ అనేది వర్మ పరిచయం చేసిందే. అదే ఫార్మాట్‌ను ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. రాం గోపాల్ వర్మ ఫ్యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎలాంటి పవర్ ఫుల్ స్టోరీనైనా తీయగల సత్తా వర్మకు ఉంది. ఇలాంటి వర్మ నట సింహం నందమూరి బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాను తీస్తే రికార్డుల గురించే మాట్లాడుకుంటారు.రక్త చరిత్ర, సర్కార్, సత్య, రంగీల ..ఇప్పుడు రూపొందుతున్న కొండా ..ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ తీసిన పవర్ ఫుల్ మూవీస్ ఒక్కొక్కటీ బయటకు వస్తాయి. ఇక బాలయ్య ట్రెండ్ మారి చేసిన సమరసింహా రెడ్డి ఆ తర్వాత చేసిన నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, చెన్నకేశవ రెడ్డి, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సింహ, లెజెండ్, ఇటీవల వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠించిన సినిమాలే.

ఇవన్నీ నట సింహం స్టామినాని ప్రూవ్ చేసినవి. ఫ్యాక్షన్ సినిమా అంటే బాలయ్య అనే బ్రాండ్ పడిపోయింది. అదే ఆర్జీవీతో గనక బాలయ్య ఇలాంటి ఓ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ స్టోరీని తీస్తే ఇన్నేళ్ళ సినీ చరిత్ర తిప్పి రాసుకోవాల్సిందే. మరి ఆర్జీవీకి ఎప్పుడు బాలయ్యతో సినిమా తీయాలనే మూడ్ వస్తుందో.

Share post:

Popular