సెక్స్‌లో పాల్గొనేటప్పుడు అస్సలు చేయకూడని 5 తప్పులు ఇవే..!

శృంగార జీవితంలో సంతృప్తి దొరకకపోతే భార్యాభర్తల బంధం ఎంతోకాలం నిలవదు. అందుకే దంపతులు తమ శృంగార జీవితం ఇద్దరికీ సంతృప్తిని కలగజేస్తుందో లేదో తెలుసుకోవాలి. అలాగే సెక్స్‌ పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఒక రోబో లాగా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొత్తగా శృంగార మధురిమలలో తెలియాడాలి. అలాగే సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కొన్ని తప్పు చేయకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇష్టాలను నిర్భయంగా చెప్పకపోవడం

శృంగారం విషయానికి వస్తే మగవారు తమకు ఏది ఇష్టమో నిర్మొహమాటంగా తమ భాగస్వామితో చెప్పుకుంటారు. అలా తమకు కావలసినట్టు శృంగారాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఆడవారు మాత్రం తమ ఇష్టాలను బయటికి చెప్పుకోలేరు. సిగ్గు, బిడియం, భర్త ఏమనుకుంటాడో అనే భావన వల్ల వీరు తమకేం కావాలో అడగలేరు. అయితే ఇలా ఉండకూడదని అంటున్నారు నిపుణులు. భర్త వద్ద అన్ని ఫీలింగ్స్ చెప్పుకుంటూ.. తమకు ఎలా అయితే బాగుంటుందో స్త్రీ తెలియజేస్తే శృంగార జీవితం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

2. అందుకు ఆసక్తి చూపకపోవడం

మగవారే శృంగారాన్ని మొదలెట్టాలి. అప్పుడే ఆడవారు సెక్స్‌లో పాల్గొనాలి అనే ఒక తప్పుడు భావన చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి ఆడవారు వారంతట వారే సెక్స్ కావాలని తమ భాగస్వామిని ఎప్పుడూ అడగరు. అయితే ఇలా ద‌ద్దిలా ఉండే ఆడవారిపై తమ భాగస్వాములకు చాలా బోర్ కొట్టేస్తుందట. అందుకే స్త్రీ కూడా శృంగారాన్ని మొదలు పెట్టడానికి ఆసక్తి చూపితే అప్పుడు భర్తకు మరింత మజా కలుగుతుంది.

3. అందంగా లేమని భావించడం

కొందరు తాము అందంగా లేమని ఆత్మనూన్యత భావనతో శృంగార సమయంలో అంతగా ఎంజాయ్ చేయలేరు. ఇలాంటి భావనకు ఫుల్‌స్టాప్ పెట్టి శృంగారానికి, అందానికి ఎలాంటి సంబంధం లేదని గ్రహించాలి. అన్ని విషయాలు మర్చి భాగస్వామితో శృంగార రస భావాల్ని రుచి చూడాలి.

4. అతిగా ఆలోచించడం

చాలామంది తాము కరెక్ట్‌గానే శృంగారంలో పాల్గొంటున్నామా, తమ భాగస్వామిని సంతృప్తి పరుస్తున్నామా అని అతిగా ఆలోచిస్తుంటారు. ఓవర్ థింకింగ్ వల్ల ఒరిగేదేమీ లేదు కాబట్టి ఈ అలవాటును మానుకోవాలి. ఏమీ ఆలోచించకుండా ప్రతి క్షణాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తూ ఈ కార్యాన్ని పూర్తి చేస్తే ఇద్దరికీ సంతృప్తి లభిస్తుంది.

5. దూకుడుగా ఉండటం

సెక్స్‌లో అప్పుడప్పుడు కాస్త రఫ్గా, దూకుడుగా ఉంటే శృంగార జీవితం మరింత ఎగ్జైటింగ్‌గా మారుతుంది. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా నాని సినిమాలో అమీషా పటేల్ లాగా రెచ్చిపోవడం సమంజసమే!

Share post:

Popular