బ్ర‌హ్మానందం సినిమాల‌తో అన్ని కోట్ల ఆస్తులు కూడ‌బెట్టాడా… షాకే…!

బ్రహ్మానందం తెలుగు సినిమా రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని కమెడియన్‌గా కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాల్లో తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందాన్ని మాత్రం ఎవరు దాటిన పరిస్థితి లేదు. బ్రహ్మానందం సినిమాలో కనిపించారు అంటే చాలు అప్పటి వరకు ఎన్ని టెన్ష‌న్లు ఉన్న వారు అయినా మూడు గంటలపాటు నవ్వుతూ ఆనందంగా థియేటర్ల నుంచి బయటకు వస్తారు.

అసలు 10 సంవత్సరాల క్రితం ఏ సినిమాలో చూసుకున్నా బ్రహ్మానందం ఉండాల్సిందే.. బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. అయితే ఇప్పుడు వయసు పైబడటంతో బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. బ్రహ్మానందం నాటి తరం హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ నుంచి ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు ఇప్పటి తరం హీరోలు ఎన్టీఆర్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ – అల్లు అర్జున్ – రామ్ చరణ్‌తో సైతం బ్రహ్మానందం నటించి సూపర్ హిట్ కొట్టారు.

బ్రహ్మానందం సినిమాల్లోకి రాక ముందు తొమ్మిది సంవత్సరాలపాటు లెక్చరర్‌గా కొనసాగారు. తాతావతారం అనే సినిమాలో మొదటి సారి నటించిన ఆయన అహనా పెళ్ళంట సినిమా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో అరగుండు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

అలాగే జంబలకిడిపంబ సినిమాలో కూడా బ్రహ్మానందం పాత్ర హైలెట్ అయ్యింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు… చెప్పుకుంటూపోతే బ్రహ్మానందం చేసిన సినిమాల్లో ఎన్నో పాత్రలు ఆ సినిమాలకు జీవం పోసాయి. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉన్న సమయంలో బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్‌కు రు. ల‌క్ష రెమ్యున‌రేష‌న్ తీసుకునే వారు. ఆ త‌ర్వాత అది రు. 2 – 3 ల‌క్ష‌ల‌కు చేరింది. అయినా నిర్మాత‌లు మాత్రం ఆయ‌న త‌మ సినిమాల్లో ఉండాల‌ని మ‌రీ ప‌ట్టుబ‌ట్టేవారు.

ఎన్నో ఏళ్ల పాటు సినిమాల్లో తీరిక‌లేనంత బిజీగా ఉన్న బ్ర‌హ్మానందం ఓవ‌రాల్‌గా రు. 500 కోట్ల‌కు పైగా ఆస్తులు కూడ‌బెట్టార‌ని చెపుతారు. ఆయ‌న కుమారుడు గౌత‌మ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసినా అవేవి స‌క్సెస్ కాలేదు.

Share post:

Popular