నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న‌ ఇంట్లోవాళ్ల‌కు ఎందుకు దూర‌మ‌య్యాడు.. ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన నందమూరి హీరో తారకరత్నకు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తారకరత్న తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా హీరోగా కంటే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కొన్ని సినిమాలలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించలేక పోయేసరికి చివరికి అమరావతి సినిమా ద్వారా విలన్ గా మారి.. నంది అవార్డును సైతం సొంతం చేసుకున్నారు తారకరత్న.

మొదటి సారి ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమా ద్వారా ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారకరత్న.. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించినా.. ఏ ఒక్క సినిమా కూడా తన కెరీర్ కు కాలేకపోయింది. ఇక దర్శక నిర్మాతలు కూడా తారకరత్నకు అవకాశం ఇవ్వడం పూర్తిగా తగ్గించారు.ముఖ్యంగా ఆయన కెరీర్ నాశనం అవ్వడానికి కారణం తన సినిమాల కథల ఎంపిక విషయంలో నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే విజయం సాధించలేకపోయాడు అని అందరూ భావిస్తూ ఉంటారు.

అంతే కాదు ఒకే సమయంలో ఏకంగా 8 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఇదిలా ఉండగా తారకరత్న ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంటి నుండి బయటకు వచ్చారని కూడా సమాచారం. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో తారకరత్న నటిస్తున్నారు.

ఇకపోతే నందమూరి హీరోల సినిమాలలో నటిస్తే అతని క్రేజ్ పెరుగుతుంది అని.. నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి మరి ఎలాంటి విజయాలను అందుకుంటారో చూద్దాం.

Share post:

Popular