సమంత కొత్త కారు విలువ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సినీ హీరోయిన్ సమంత గురించి ప్రతీ విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆమె ఏం చేసినా సరే.. అది పెద్ద న్యూస్‌గా అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు, ఆమె సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆమె సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా.. సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ ఇచ్చినా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా సమంత కొత్త కారుపై అనేక ఫుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇటీవల సమంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ఎయిర్‌పోర్టులో కనిపించింది. సమంత ఇంత కాస్ట్ లీ కారు ఎప్పుడు కొనుగోలు చేసిందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కారు ఆమెదానా? ఇతరులదా? అనేది చర్చకు దారితీసింది. ఈ కారు విలువ ఏకంగా రూ.7 కోట్లు ఉంటుంది. ఇంత కాస్ట్ లీ కారులో సమంత ప్రత్యక్షమవడంతో చూసినవారు ఆశ్చర్యపోయారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.

ఈ సినిమాల రెమ్యూనరేషన్ తో వచ్చిన డబ్బులతో ఈ కారు కొనుగోలు చేసి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమంత కారులో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శాకుంతలం షూటింగ్ ను పూర్తిచేసిన సమంత.. యశోద, ఖుషి సినిమాల షూటింగ్ లలో పాల్గొంటోంది.

కాగా చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ముంబై చెక్కేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి ముంబైకు మకాం మార్చేసినట్లు సమాచారం. ఏవైనా షూటింగ్ లు ఉంటే తక్కువ సమంత హైదరాబాద్ రావడం లేదని, ఎక్కువ సమయం ముంబైలోనే ఉంటూ బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చైతూతో విడాకుల తర్వాత మరింత లగ్జరీ లైఫ్ సమంత అనుభవిస్తుందని, సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలను చూస్తే అర్థమవుతుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Share post:

Popular