బాలయ్య రీమేక్ చేసిన సినిమాలెన్నో తెలుసా?

సినిమాకు భాష, కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఉండవని చెబుతూ ఉంటారు. సినిమా అనేది ఒక వినోదం మాత్రమేనని, దానికి భాష, కులాలు, ప్రాంతాలు అనే బేధాలు ఉండవని సినీ సెలబ్రెటీలు చెబుతూ ఉంటారు. ఏ బాష సినిమాన్ని అయినా ప్రపంచంలోని ప్రజలందరూ చూస్తున్నారని, సబ్ టైటిల్ రూపంలో చూసి ప్రతిఒక్కరూ ఆనందిస్తున్నారని చెబుతున్నారు. ఇక లాక్ డౌన్ లో ఓటీటీ హవా ఎక్కువైపోయి ప్రతి సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ గా టాక్ వస్తుంది. సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తున్నారు.

ఈ క్రమంలో రీమేక్ సినిమాల ట్రెండ్ కూడా విపరీతంగా ఎక్కువైంది. హీరోలందరూ రీమేక్ సినిమాల మీద పడిపోతున్నారు. ఇతర బాషల్లో హిట్ అయితే ఇక్కడ కూడా హిట్ అవుతుందనే భావనలో ఉన్నారు. మార్కెట్ లో దొరికే రెడీమెడ్ సరుకుగా రీమేక్ కథలు తయారయ్యాయి. రీమేక్ సినిమాను ఎంచుకుంటే కథ, స్క్రీన్ ప్లే లాంటివి రాయాల్సిన అవసరం ఉండదు. దీంతో ఈ మధ్య ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాను వేరే బాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఇలా నందమూరి బాలకృష్ణ కూడా ఇతర భాషల్లో వచ్చిన అనేక సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. హాలీవుడ్‌లో తెరకెక్కిన టోటల్ రీకాల్ సినిమా తెలుగులో బాలయ్య హీరోగా లయన్ గా తెరకెక్కింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమాను ఒక్కమగాడుగా, హాలీవుడ్ సినిమా బౌర్నే ఐడెంటిటి, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాలను తీసుకుని విజయేంద్రవర్మగా రూపొందించారు. ఇక తమిళ సినిమా సామిని తెలుగులో లక్ష్మీనరసింహగా, కన్నడలో వచ్చిన రాజనర్సింహ సినిమాను పలనాటి బ్రహ్మనాయుడుగా తెలుగులో రీమేక్ చేశారు.

ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన ఎన్ తంగాచ్చి పడిచావా సినిమాను తెలుగులో ముద్దుల మావయ్యగా, మరో తమిళ సినిమా తంగమన రాసా సినిమాను తెలుగులో ముద్దల మేనల్లుడిగా రీమేక్ చేశారు. ఇక ఎన్టీఆర్ నటించిన సత్యహరిచంద్ర, శకుంతల సినిమాలను తీసుకుని బ్రహ్మర్షి విశ్వామిత్రగా తీశారు.

Share post:

Popular