“నువ్వు నాకు నచ్చావ్” పింకీగా ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

2001లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ నువ్వు నాకు నచ్చావు ఒక క్లాసిక్ సినిమాలా మిగిలిపోయింది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటిలో పింకీ క్యారెక్టర్ ఒకటి. ఈ సినిమాలో పింకీకి స్క్రీన్ టైమ్‌ ఎక్కువగానే ఉంటుంది. ఒక సీన్‌లో కొందరు కుర్రాళ్లు ఏడిపిస్తుంటే.. కోపంతో తలదించుకుని గోళ్లు కొరుకుతూ ఉంటుంది పింకీ.

- Advertisement -

అయితే వాళ్లని వెళ్లి కొట్టేయ్ అని వెంకటేష్ ధైర్యం చెప్తే పింకీ బలంగా ఒక గుద్దు గుద్దుతుంది. ఆ సమయం నుంచి చివరి వరకు పింకీ క్యారెక్టర్ కనిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్‌గా నటించిన ఆర్తి అగర్వాల్, వెంకటేష్‌లపై ఆమె సెటైర్లు పేల్చుతూ తెగ నవ్విస్తుంది. ఇలా టాలీవుడ్ ప్రేక్షకుల మనుషుల్లో పింకీ రోల్ చెక్కుచెదరని స్థానం సంపాదించింది. ఈ రోల్‌ను పోషించిన నటి పేరు సుదీప రాపర్తి. సుదీప నువ్వు నాకు నచ్చావ్ సినిమా తర్వాత కూడా చాలా మూవీలలో చేసింది.

7/జీ బృందావన్ కాలనీ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర పోషించింది. నీ స్నేహం, నాగ, గుడుంబా శంకర్, అతనొక్కడే, అసాధ్యుడు, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో కూడా హీరో లేదా హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె చివరగా 2014లో అమర కావ్యం అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ సిస్టర్‌గా కనిపించింది. ఆ తర్వాత తెరమరుగైంది. బుల్లి తెరపై మాత్రం అలరించింది. జెమినీ టీవీలో ప్రసారమైన సునైనా, కొత్త బంగారం, మావి చిగురు, ప్రతిఘటన సీరియల్స్‌లో కీలక పాత్రలలో నటించింది.

జీ తెలుగు సీరియల్ పసుపు కుంకుమలో కూడా నటించింది. ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఆ ఒక్కటి అడక్కు సీరియల్లో నటిస్తోంది. ఈ తార సీరియల్స్‌లోనే కాకుండా చాలాసార్లు బుల్లితెరపై మెరిసింది. ఈటీవీలో వచ్చిన అడ్వెంచర్ రియాలిటీ షో సూపర్ 2 అనే ప్రోగ్రామ్‌లో ఆమె ఒక కంటెస్టెంట్‌గా పాల్గొంది. తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు, కామెడీ ప్రోగ్రామ్‌లకు వచ్చి సందడి చేసింది.సినిమాలు, సీరియల్స్‌లో కొనసాగుతూనే సుదీప ఉన్నత చదువులు అభ్యసించింది. సుదీప ఎంబీఏ వరకు చదువుకుంది.

తల్లిదండ్రులిద్దరూ క్లాసికల్ డ్యాన్సర్స్‌ కావడంతో ఆమె కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లడంతో శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్‌వేర్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుదీప అందాన్ని చూసి నెటిజన్లు మైమరిచి పోతున్నారు. రీఎంట్రీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరి ఈ నటి సినిమాల్లో మళ్లీ కనిపిస్తుందో లేదో చూడాలి.

Share post:

Popular