పవన్ తో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ యాక్టర్ లు గా నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా రాణించిన వారు చాలా మంది ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్ తో కలిసి బంగారం సినిమా లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతారు . ఇందులో హీరోయిన్ మీరా చోప్రా కూడా నటించింది. ఈ చిత్రంలో హీరోయిన్ చెల్లెలుగా వింధ్య రెడ్డి పాత్రలో ఈ చిన్నారి నటించింది. ఈమె పేరు సనుషా సంతోష్. ఈమె మొదటగా బంగారం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక బంగారం సినిమా కంటే ముందు సనూష చైల్డ్ యాక్టర్ గా మలయాళం సినిమాల్లో దాదాపు 20కి పైగా చిత్రాలలో నటించిన నటుడిగా తెలుస్తోంది. అతి చిన్న వయసులోనే ఈమె రెండు సార్లు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డులను అందుకోవడం గమనార్హం. ఆ తరువాత సనూష హీరోయిన్ గా 2012వ సంవత్సరంలో మిస్టర్ మురుగన్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో మాత్రం.. జీనియస్, రేణిగుంట వంటి చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించి అందరినీ బాగా ఆకట్టుకుంది.

ఇక అంతే కాకుండా హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలో కూడా ఈమె జర్నలిస్టు పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాగా అభిమానులను సంపాదించింది సనూష. రాబోయే రోజులలో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి. ఇక టాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఏదిఏమైనా చైల్డ్ యాక్టర్గా కంటే హీరోయిన్ గానే ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉందని చెప్పవచ్చు.

Share post:

Popular