రాజమౌళి ఆస్తులు అన్ని కోట్లా..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న జక్కన్న ప్రాపర్టీస్ లిస్ట్..?

నిన్న మొన్నటి వరకు మన తెలుగు ఇండస్ట్రీ అంటే అందరికి చిన్న చూపే. రీజన్ ఏంటో తెలియదు కానీ, ఎక్కడికి వెళ్లినా మన సినిమాలకి పెద్దగా విలువ ఇచ్చేవారు కాదు. ఎప్పుడు బాలీవుడ్ సినిమాలనే పొగుడుతూ..అస్సలు ఇండస్ట్రీ అంటేనే బాలీవుడ్ అన్న స్దాయికి వచ్చి మాట్లాడే వాళ్లు. అలాంటి టైంలో ఇండస్ట్రీకి ఒక్క మగాడిలా వచ్చాడు..దర్శక ధీరుడు రాజమౌళి. స్టూడెంట్ నెం 1 తో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టి..ఆ తరువాత మగధీర సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ లెక్కలు మర్చేసిన ది వన్ అండ్ ఓన్లీ జక్కన్న.

- Advertisement -

ఇప్పుడు మన తెలుగు సినిమాల గురించి ప్రపంచ స్దాయిలో చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణం రాజమౌళి. ఈయన స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయనతో సినిమా తీస్తే..ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం అందరిలోను ఉంటుంది. రాజమౌళి తను అనుకున్న కధను ప్రజల ముందుకు సినిమా రూపంలో క్లీయర్ కట్ గా తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్. ఇప్పుడు స్టార్ హీరో లు అందరు రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఎదురుచూస్తున్నారు. అంతలా మారిపోయింది ఆయన రేంజ్.

రాజమౌళి హీరోలకి ధీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వెళ్తుంది. RRR సినిమా కోసం ఆయన తారక్, చరణ్ లు కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటూ అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేసాయి. అయితే, రీసెంట్ గా రాజమౌళి సంబంధించిన ఆస్తుల లెక్కలు సినీ వర్గాలను షాక్ కి గురి చేస్తున్నాయి. సినిమా కి భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ అందుకునే రాజమౌళి పేరిట కేవలం 148 కోట్లు ఆస్తులు ఉండటం గమనార్హం. ఆయన ఎలా లేదన్న సినిమా 60 నుండి 70 కోట్లకు పైగానే పారితోషకం పుచ్చుకుంటాడు అన్న టాక్ ఉంది. మరి అలాంటి ఆయన పేరు మీద ఇంత తక్కువ వాల్యూ ప్రాపర్టీస్ ఉండటం ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది.

Share post:

Popular