10 ఏళ్ల కంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న సెల‌బ్రిటీ జంట‌లు వీళ్లే…!

బేసిగ్గా అరేంజ్డ్ మేరేజెస్ చాలా వయసు వ్యత్యాసంతో జరుగుతూ ఉంటాయి. అందులో మీరు కూడా ఉండి ఉండవచ్చు. అయితే కొన్ని ప్రేమ వివాహాలలో కూడా ఈ వ్యత్యాసాన్ని మనం చూడవచ్చును. ముఖ్యంగా మన సినిమా తారల వివాహాలలో ఈ రకమైన తేడాలు మనం గమనించవచ్చు. ప్రేమకి వయసు అడ్డు రాదు అని అనేకమంది తారలు నిరూపించారు. వారిలో కొంత మంది డేటాను ఇపుడు మనం పరిశీలిద్దాము. ఇటీవలి ‘పుష్ప’తో ఫహాద్, ‘అంటే సుందరానికి’ సినిమాతో నజ్రియా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ జంట మధ్య 12 సంవత్సరాల తేడా ఉందని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.

అలాగే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కొద్ది సంవత్సరాల క్రితం కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. వీరిద్దరికి కూడా సుమారు 12 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుందని భోగట్టా. అలాగే అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సయేషా, ప్రముఖ తమిళ నటుడు ఆర్యని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ వయసులో దాదాపు 17 సంవత్సరాల తేడా ఉంటుంది.

ఇక తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. వీరిద్దరికీ వయసులో 9 సంవత్సరాల తేడా ఉంది. అలాగే ఇక్కడి నుండి బాలీవుడ్ కి ఎక్స్పోర్ట్ అయిన హీరోయిన్ అసిన్ – రాహుల్ శర్మ మధ్య వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది. బాలీవుడ్ కి వెళ్లిన ఈ అమ్మడు అక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాక, ఈ వ్యాపారవేత్తతో సెటిల్ అయిపోయింది.

ఇక తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ – షాలిని వీరిద్దరి మధ్య 8 సంవత్సరాల వయసు తేడా ఉందని తెలిసిందే. అలాగే సీనియర్ మోస్ట్ హీరో శరత్ కుమార్ – రాధిక మధ్య కూడా 8 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది. చివరగా బాలీవుడ్ రారాజు రణబీర్ కపూర్ – ఆలియా భట్ మధ్య దాదాపు 10 సంవత్సరాల తేడా ఉంటుందని వినికిడి. ఇలా అనేకమందిని చిత్ర పరిశ్రమలో మనం చూడవచ్చును.

Share post:

Popular