వామ్మో… పెళ్లిలో నయనతార దుస్తులు, నగలు ఖరీదు ఇంత కాస్టా..!

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార దాదాపుగా 18 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో పని చేస్తూనే ఉన్నారు. ఇక తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు తన ఏడు సంవత్సరాల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి .. రంగ వైభవంగా నేడు మహాబలిపురం లో చాలా ఘనంగా వివాహం చేసుకుంది.

ఈ వివాహానికి అతిరథమహారధులు హాజరవడం తోపాటు ప్రముఖ సినీ నటులు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి , సమంత, షారుక్ ఖాన్ , రజనీకాంత్ తో పాటు పలువురు నటులు కూడా హాజరయ్యారు అని సమాచారం. ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా బయట షేర్ చేయబడలేదు. దాంతో అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా వీరిద్దరు ఎలా ఉన్నారు..? వీరి పెళ్లి ఎలా జరిగింది..? ఎంత అందంగా ముస్తాబయ్యారు..? ఎలాంటి దుస్తులు ధరించారు..? ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరిలో సందేహాలు ఉన్నాయి.

నయనతార అద్భుతమైన కాస్ట్యూమ్ తో కళ్ళు మెరిసే నగలతో చాలా చక్కగా ముస్తాబయింది. ఇక ఈ పెళ్లి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చీర కోసం ఏకంగా 12.5 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు సమాచారం. ఈమె చీర కొనుగోలు చేసినా.. అందరూ ఈ చీర గురించి మాట్లాడుకునే లాగా విభిన్నమైన ఆకృతి లో అందరినీ ఆకట్టుకునేలా ప్రేక్షకులను అలరించింది.

ఇక నగల విషయానికి వస్తే 2.5 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాదు పెళ్లి కోసం ప్రత్యేకంగా గద్వాల్ చీరను బంగారు దారాలతో చేయించినట్లు సమాచారం. దీని విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఆమె ధరించిన చీర, బంగారు నగలు మాత్రమే కాకుండా సహజంగానే ఎంతో అందంగా ఉండే నయనతారను ఇలా పెళ్లికూతురు గెటప్ లో చూడడం అంటే రెండు కళ్ళూ సరిపోవు అని చెప్పవచ్చు.

Share post:

Popular