విగ్నేష్ కంటే నయనతార ఎన్నేళ్లు పెద్దదో తెలుసా… !

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విగ్నేష్ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలకు షారుక్ ఖాన్, విజయ్ వంటి బడా హీరోలు సైతం విచ్చేశారు. వీరి మ్యారేజ్ ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నయనతార సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. ఆమె భర్త విగ్నేష్ కూడా సినిమాల్లో చాలా ఏళ్ల నుంచే పనిచేస్తున్నారు. కాకపోతే విగ్నేష్ ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం నాలుగు సినిమాలే. అవి కూడా బిగ్గెస్ట్ హిట్స్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. విగ్నేష్ డైరెక్షన్‌లో మరో రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటితోనైనా డైరెక్టర్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంటాడో కాలమే చెప్పాలి.

2015లో నయనతార హీరోయిన్‌గా విఘ్నేశ్‌ ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ అనే ఒక సినిమా తీశాడు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే విగ్నేష్ కంటే నయనతార వయస్సు పెద్దదని సోషల్ మీడియాలో ఇప్పుడొక చర్చ జరుగుతోంది. పుట్టిన తేదీల ప్రకారం చూస్తే, విగ్నేష్ శివన్ కంటే నయనతార సరిగ్గా ఒక సంవత్సరం రెండు నెలలు పెద్దది. నయనతార నవంబర్ 18, 1984లో జన్మించగా.. విగ్నేష్ సెప్టెంబర్ 18, 1985లో పుట్టాడు. ఒక సంవత్సరం అనేది పెద్ద వ్యత్యాసమేం కాదు. సో, వీరికి ఏజ్ అనేది ఒక సమస్య ఎప్పటికీ కాకపోవచ్చు.

ఇకపోతే నయనతార తన పెళ్లి రోజున చాలా గొప్ప పనులు చేసి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఆమె తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రయాల నుంచి వృద్ధాశ్రమాలు వరకు లక్ష మందికి రుచికరమైన పెళ్లి భోజనం పెట్టించింది. ఆమె దయవల్ల అభాగ్యులు ఒక్కరోజైనా రుచికరమైన భోజనంతో తమ కడుపు నింపుకోగలిగారు. అందుకే ఆమె చాలా గ్రేట్ అని ఇప్పుడు చాలామంది పొగుడుతున్నారు. ఏది ఏమైనా నయనతార వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆమె వాటన్నిటినీ అధిగమించి కెరీర్‌లో ఓ మంచి స్థాయిలో నిలబడింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ను కూడా హ్యాపీగా మార్చుకోగలిగింది.

Share post:

Popular