విఘ్నేష్ పాపులారిటీ వెన‌క నయనతార మాజీ ల‌వ‌ర్‌…!

నేడు ఉదయం 8:30 గంటల సమయంలో మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్ లో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య నయనతార , విగ్నేష్ శివన్ హిందు సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. కొన్ని రోజుల క్రితం వరకు ప్రేమికులైన నయన్, విగ్నేష్ నేడు మూడుముళ్ల బంధం ద్వారా ఒకటవడం జరిగింది.

విగ్నేష్ కంటే నయనతార వయస్సు లో ఒక ఏడాది పాటు పెద్దది కావడం గమనార్హం. పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలలో అది కూడా ప్రత్యేకమైన పాత్రలో మాత్రమే కొనసాగుతుంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోలు శింబు, ప్రభుదేవా లతో ప్రేమలో పడిన నయనతార వేర్వేరు కారణాల వల్ల తమ ప్రేమ బంధాన్ని.. పెళ్లి బంధం గా మార్చుకోలేక పోయారు.

కానీ విగ్నేష్ కు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం మాత్రం హీరో శింబు అని తెలుస్తోంది.. హీరో శింబు విగ్నేష్ శివన్ ఇద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇక విగ్నేష్ తెరకెక్కించిన షార్ట్ ఫిలిం నచ్చడంతో తన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని విగ్నేష్ కి శింబు ఇచ్చినట్లు సమాచారం.విగ్నేష్ .. శింబు కాంబినేషన్లో తెరకెక్కిన పొడా పొడి సినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది.

ఇక తర్వాత విగ్నేష్ శివన్ నయనతారతో కలిసి తన 2 వ సినిమా నేను రౌడీనే అనే సినిమాను తెరకెక్కించారు.అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక విగ్నేష్ శివన్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నయనతార కూడా లేడీ సూపర్ స్టార్ గా చలామణి అవుతూ ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.ఇక ఒక్కో ఈమె సినిమాకు ఐదు కోట్ల రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

Share post:

Latest