పవన్‌కు సుకుమార్ కథ.. చివరికి ఏమైందంటే..?

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆయనకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరికీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్ బేస్ పరంగా పవన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయనకు అభిమానులు కన్నా.. వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యక్తిత్వ పరంగా కూడా పవన్ ను ఎంతోమంది అభిమానిస్తారు. దీంతో పవన్ తో సినిమా చేయడానికి దర్శక, నిర్మాతలు, ఆయనతో కలిసి నటించడానికి నటులు క్యూ కడుతుంటారు.

ఓపెనింగ్ కలెక్షన్స్‌లో పవన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయనకు సినిమాకు వచ్చినంత ఓపెనింగ్ కలెక్షన్లు వేరే హీరోకు రావు. దీంతో నిర్మాతలు పవన్ తో సినిమా చేసేందుకు ఆరాటపడుతుంటారు. ఇక డైరెక్టర్లు కూడా పవన్ తో సినిమా తీసేందుకు కథలు పట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదే కోవలో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా చేరిపోయారు.

ఆర్య సినిమా తర్వాత పవన్ తో కథ చెప్పడానికి వెళ్లానని, కానీ వెళ్లిన తర్వాత కథ చెప్పలేకపోయానని సుకుమార్ అప్పటి విషయాన్ని బయటపెట్టాడు. తాజాగా జరిగిన అంటే సుందరానికి ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు సుకుమార్ కూడా అటెండ్ అయ్యాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడిన సుకుమార్.. ఆర్య తర్వాత పవన్ కు కథ చెప్పడానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే తాను భీమ్లా నాయక్ షూటింగ్ దగ్గరకు వెళ్లినప్పుడు జరిగిన విషయాన్ని కూడా సుకుమార్ బయటపెట్టాడు. భీమ్లా నాయక్ షూటింగ్ దగ్గరకు వెళ్లినప్పుడు తనకు కొంచెం ఆయాసంగా ఉందని, ఇది గమనించిన పవన్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా త్రివిక్రమ్ తో తనకు చెప్పించారని సుకుమార్ తెలిపాడు. తన ఆరోగ్యం గురించి పవన్ చెప్పిన మాటలతో ఆనందంగా కలిగిందన్నాడు.

Share post:

Popular