అప్పుడు మోహన్ బాబు..ఇప్పుడు చిరంజీవి..సేమ్ ఫార్ములా రిపీట్ చేస్తున్న పెద్దాయన..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే మాట నిజం అంటున్నారు సినీ వర్గాలు. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న షో..బాలయ్య అన్ స్టాపబుల్. ఆహా వాళ్ళతో కలిసి బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి ఓ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటికి వరకు బాలయ్య లోని కోపం, ప్రేమ, స్మైల్, యాక్షన్ చూసిన జనాలకు ఫస్ట్ టైం ఆయన లోని చిలిపి అల్లరిని కూడా చూయించాడు.

- Advertisement -

ఆహాలో అన్ స్టాపబుల్ విత్ NBK అంటూ ఓ షో ని స్టార్ట్ చేసారు. అప్పటి వరకు వందల మందికి తెలిసిన ఆహా..ఆ తరువాత..లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు పెరిగారు. బాలయ్య తన వాక్చాతుర్యంతో..సరదా అల్లరితో షో కి వచ్చిన స్టార్ సెలబ్రిటిలను తన దైన స్టైల్ లో ప్రశ్నలు వేస్తూ..అల్లరి చేస్తూ..ఆటపట్టిస్తూ..సరదాగా ప్రోగ్రామ్ ను ముందుకు తీసుకెళ్ళారు. ఇలా అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ కి మోహన్ బాబు ని గెస్ట్ గా పిలిచారు.

అయితే, ఈ షో సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ ఈగర్ వెయిట్ చేస్తున్న అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనున్నారు ఆహా టీం. ఇప్పటికే సెకండ్ సీజన్ షో కి సంబంధించి అన్ని పనులను చకచకా పూర్తి చేసుకుంటున్నా..అన్ స్టాపబుల్ టీం..షో కి వచ్చే గెస్ట్ల లిస్ట్ కూడా ప్రిపేర్ చేసిందట. అయితే..ఫస్ట్ సీజన్ కి మిస్ అయిన చిరంజీవిని సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి పంపేలా ప్లాన్ చేస్తున్నారట అల్లు అరవింద్. బాలయ్య-చిరంజీవిలను ఒక్కే తెర పై చూస్తే ఆ కిక్కే వేరు.. ఇక బాలయ్య , చిరంజీవిని ఇంటర్వ్యు చేస్తే..అబ్బో అదో రకమైన కిక్కో కిక్కు అంతే..!

Share post:

Popular