వరుసగా 7 సినిమాలు ఫ్లాప్…. బాలయ్య ఆ డైరెక్టర్ తో ఏమన్నాడంటే…!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోకైనా .. దర్శకుడు కైనా సక్సెస్ అనే పదం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సక్సెస్ లేకపోతే ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇప్పటికే చాలామంది ఫ్లాప్ లను చవిచూసి ఇండస్ట్రీకి దూరమైన డైరెక్టర్లు ,హీరోలు కూడా ఉన్నారు. మరికొంతమంది బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో కూడా ఎన్నో ఇండస్ట్రీలో బ్లక్ బాస్టర్ హిట్లు అలాగే ఇండస్ట్రీ హిట్ లు కూడా ఉన్నాయి.

ఇక బాలకృష్ణ తెరపై కనిపించాడు అంటే ఆయన అభిమానులకు మాస్ జాతర అని చెప్పవచ్చు. ఇక అంతలా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఒకవైపు రాజకీయాలతో పాటు మరొకవైపు సినిమాలతో బిజీగా వుండగా.. గతంలో ఒకసారి లక్ష్మీ నరసింహ సినిమా విజయం తర్వాత తీసిన ప్రతి సినిమా కూడా కొన్ని సంవత్సరాల పాటు వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు బాలకృష్ణ.

ఎంతోమంది టాలెంట్ డైరెక్టర్లకు కూడా బాలయ్య అవకాశం ఇచ్చినా..ఇచ్చిన అవకాశాన్ని ఏ డైరెక్టర్ కూడా సద్వినియోగం చేసుకోలేదు.ఇక లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత వచ్చిన విజయేంద్ర వర్మ , వీరభద్ర, అల్లరి పిడుగు, మహారధి, ఒక్కమగాడు ,మిత్రుడు , పాండురంగడు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ ను చవిచూశాయి. ఇందులో కొన్ని సినిమాలు నిర్మాతల అంచనాలకు మించి నష్టాలు తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమాల వల్ల ప్రేక్షకులలో బాలయ్యకు సైతం ఆ సమయంలో ఒకింత క్రేజ్ కూడా తగ్గిందని చెప్పవచ్చు.

వరుస ఫ్లాప్ లు రావడంతో సినిమాల బిజినెస్ పై కూడా ప్రభావం చూపాయి. ఇదిలా ఉండగా వరుస ఫ్లాపులు వచ్చిన సమయంలో ఒక డైరెక్టర్ కథ చెప్పడానికి వెళ్లితే బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారట. చాలామంది దర్శకులను నమ్మే ఆఫర్లు ఇస్తుంటే ఏ ఒక్కరు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో లేకపోయారు అంటూ బాధ పడ్డారట. అయితే ఆ తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో సింహ సినిమాతో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు.