2010లో విడుదలైన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ ప్రియా ఆనంద్. ఈ సినిమాలో హీరోగా రానా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియా ఆనంద్ మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఈమె తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి ఇలాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో కెరీర్ పరంగా బాగా దూసుకెళుతున్న సమయంలో తమిళంలో వరుసగా అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
దాదాపుగా పదేళ్లపాటు తమిళంలోనే వరుసగా సినిమాలను చేస్తూ బిజీ గా మారిపోయింది. కాగా ఈమెకు తమిళ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన తర్వాత ఈమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణలు ఫలించాయి. ప్రియా ఆనంద్ పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. వరుడు కావలెను ఫేమ్ లేడీ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ హీరోగా నటిస్తున్న మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వబోతోంది ప్రియా ఆనంద్.
దాదాపుగా పదేళ్ల తర్వాత ఈ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో అభిమానులు ఆనందపడటంతో పాటుగా ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ ఈనెల జూలై 15వ తేదీన జి 5 లో ప్రసారం కానుంది. కాగా ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి హీరోయిన్ ప్రియా ఆనంద్ దాదాపుగా పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి ఈమె నటిస్తున్న ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.