ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌ల్లే నా కూతురు సినిమాల‌కు దూర‌మైంది.. సీనియ‌ర్ న‌టి సంచ‌ల‌నం..!

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమాలో ప‌నిచేసిన న‌టీన‌టుల‌కు కూడా అంతే పేరు వ‌చ్చింది. అప్ప‌ట్లో యూత్‌ను ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుందీ సినిమా. ఈ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ డైరెక్ట‌ర్ అవ్వ‌డంతో పాటు యూత్‌ను మెప్పించే డైరెక్ట‌ర్ అయిపోయాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ సినిమాలో బాయ్ క‌ట్‌తో న‌టించిన అమ్మాయి అంద‌రికి గుర్తుండి పోతుంది.

ఆమె అప్పు క్యారెక్ట‌ర్‌లో సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆమె అసలు పేరు గాయ‌త్రి రావు. ఆమెది సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబ‌మే.. గాయత్రి రావుకు హ్యాపీడేస్ తొలి సినిమాయే అయినా కూడా ఎంతో అనుభ‌వం ఉన్న న‌టిలా ఆ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇక గాయ‌త్రి రావు త‌ల్లి ఎవ‌రో కాదు… ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించిన బెంగ‌ళూరు ప‌ద్మ‌.

హ్యాపీడేస్ సినిమాలో ఓ హీరోయిన్ పాత్ర కోసం గాయ‌త్రి ఎంపికైన‌ప్పుడు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఆమెతో బాయ్ క‌ట్ చేయించుకోవాల‌న్న కండీష‌న్ పెట్టాడ‌ట‌. అయినా కూడా పాత్ర‌పై ఉన్న ఇష్టంతో ఆమె అలాగే చేసింది. ముందు బాధ‌ప‌డుతూ బాయ్ క‌ట్ చేయించుకున్నా కూడా త‌ర్వాత అప్పు పాత్ర కెరీర్‌లో ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేని పాత్ర‌గా మిగిలిపోయింద‌ని గాయ‌త్రి త‌ల్లి బెంగ‌ళూరు ప‌ద్మ చెప్పింది.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా త‌ర్వాత త‌న కుమార్తె ఇక సినిమాలు చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యింద‌ని.. అందుకు ఓ కార‌ణం కూడా ఉంద‌ని బెంగ‌ళూరు ప‌ద్మ చెప్పారు. ఈ సినిమాలో త‌న కుమార్తెను తీసుకునే ముందు హీరోతో ట్రైయాంగిల్ ల‌వ్ ఉంటుంద‌ని.. ఆ పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని చెప్పార‌ని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక డిఫ‌రెంట్ టాక్ రావ‌డంతో ఇక సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

ఆ త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి పీజీపూర్తి చేసింద‌ని ప‌ద్మ తెలిపారు. ఆ త‌ర్వాత త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లి అక్క‌డ కూడా ఒక‌టి రెండు సినిమాలు చేసి.. పెళ్లి చేసుకుని చెన్నైలోనే సెటిల్ అయిపోయింద‌ని చెప్పారు. ఇక గాయ‌త్రి త‌ల్లి బెంగ‌ళూరు ప‌ద్మ తెలుగులో సినిమాల‌తో పాటు ప‌లు సీరియ‌ల్స్ కూడా చేసింది. ఆమె తండ్రి అరుణ్‌రావు.

Share post:

Popular