అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా నుండి తప్పుకుందా ?

సినిమా ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్ లు వస్తుంటారు..పోతుంటారు. కానీ ఎందరు వచ్చినా కొందరు హీరోయిన్ లు మాత్రం స్టాండర్డ్ గా వారి స్థాయి మరియు వారికి అవకాశాలు ఎప్పటికీ తగ్గవు. ఈ కోవలోకే వస్తుంది ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క అని పిలుచుకునే స్వీటీ. సినిమా పరిశ్రమలో అనుష్క స్థానం ఎప్పటికీ ఆమెదే… గతంలో ప్రేక్షకుల మనసును మెప్పించిన హీరోయిన్ లు సావిత్రి, సౌందర్య, ప్రత్యూష ల సరసన ఈమె చేరుతుంది అని చెప్పాలి. వీరిలో అనుష్క కూడా అభిమానుల మనసును గెలుచుకుంది. ఈమె గురించి ఎంత పొగిడినా కూడా తక్కువే అవుతుంది… తెలుగు అభిమానుల మదిలో జేజెమ్మ గా నీరాజనాలు అందుకుంది అనుష్క. ఇక వయసు పెరుగుతున్నా తన స్వఛ్చమైన అందం ముందు ఎవరైనా బలాదూర్. ఇక నటన గురించి ఇప్పటికే తానేంటో నిరూపించుకుని దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన అనుష్క కొంత కాలంగా మాత్రం ఖాళీగా ఉంది. కారణాలు ఏమిటో తెలియకపోయినా ఈమె నుండి సినిమా కోసం అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం. అయితే అవకాశాలు రాకపోవడం అయితే కారణం కాదని తన పి ఆర్ టీమ్ నుండి అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తెలుస్తున్న దానిని బట్టి స్వీటీ తన శరీర బరువు వలనే అవకాశాలను రిజెక్ట్ చేస్తూ వస్తోంది. మామూలుగా అనుష్క ఒక యోగా టీచర్ అయినప్పటికీ తాను మాత్రం బరువు తగ్గడంలో విఫలం అవుతోందట. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మోస్తరుగా మాత్రమే బరువు తగ్గింది. కానీ సినిమాలలో నాజూకుగా కనిపించేంత తగ్గలేదు. అందుకోసం తన తాజా సినిమా నుండి తప్పుకునే పరిస్థితి వచ్చిందట. కొత్త దర్శకుడు పి మహేష్ తో నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్ గా ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా వైరల్ అయింది. అనుష్క ఇందులో 37 ఏళ్ల ఆంటీ లాగా ఉండనుంది.. ఇక నవీన్ కు 27 సంవత్సరాలు… వీరిద్దరూ ప్రేమలో పడడం. అయితే వయసు వలన వీరి ప్రేమకు ఎటువంటి ఇబ్బందులు కలిగాయి…కథ ఎన్ని మలుపులు తీసుకుంది అన్నది కథ. అయితే ప్రస్తుతం ఉన్న బరువు ఈ సినిమాలో పాత్రకు సూట్ అవదట. అందుకోసం ఎంత ట్రై చేసినా తగ్గలేదు అనుష్క.. కానీ అందరి లాగా ఏవేవో సర్జరీల ద్వారా, లేదా కెమికల్స్ వాడడం ద్వారా బరువు తగ్గడం ఇష్టం లేదట. సహజ పద్దతుల్లో తగ్గడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రస్తుతం ఉన్న లావుతో కనిపిస్తే అనుష్క ఫ్యాన్స్ నుడి నెగిటివ్ విమర్శలు రావడం పక్కా. అందువలన ఈ సినిమా షూటింగ్ లో అనుష్క పాత్రను ఇప్పుడే చేయనని చెప్పేసిందట… కాబట్టి ప్రస్తుతం అనుష్క సంబంధించిన సీన్స్ కాకుండా మిగిలిన పాత్రలపై చిత్రీకరణ జరుపుతున్నారు. మరి అనుష్క ఎప్పుడు బరువు తగ్గాలి… ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవ్వాలి.. అన్న ప్రశ్నలతో ఫ్యాన్స్ బ్రతుకుతున్నారు.

Share post:

Latest