పుష్ప హిట్ తర్వాత.. సుకుమార్ రెమ్యునరేషన్ అంతా పెంచాడా.. వామ్మో?

సాధారణంగా సినీ సెలబ్రిటీల సినిమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కంటే వారి పర్సనల్ విషయాలు ఆస్తులకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారు గా గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ 5 డైరెక్టర్లలో సుకుమార్ పేరు ఉంటుంది అని చెప్పాలి. ఇక మిగతా దర్శకులతో పోలిస్తే ఆయన సినిమా టేకింగ్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే సుకుమార్ సినిమాలో కాలిక్యులేషన్స్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. అందుకే ఆయన్ను లెక్కల మాస్టారు అని పిలుస్తూ ఉంటారు ప్రేక్షకులు. స్టోరీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఇక ఆయన టేకింగ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే సుకుమార్ సినిమా అంటే చాలు ప్రేక్షకులలో అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి.

ఇప్పుడు వరకు సౌత్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులలో అటు రాజమౌళి డైరెక్టర్ శంకర్ టాప్ లో ఉన్నారు. ఇటీవలే పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఈ లిస్టులో చేరిపోయాడు సుకుమార్. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకి 50 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. పుష్ప ముందు వరకు 30 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ఈ లెక్కల మాస్టర్.. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాకి మాత్రం 50 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు అంటూ వార్తలు టాలీవుడ్లో చక్కెర్లు కొడుతున్నాయి..