భర్త తో అనసూయ ఘాటు లిప్ లాక్..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న పిక్స్..!!

యాంకర్ అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్ధస్త్ షో యాంకర్ గా చేసి బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా అనసూయ యాక్టింగ్ స్టైల్ పక్కన పెడితే..ఆమె వేసే చిట్టి పొట్టి బట్టలు..ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మడు ఆ పొట్టి బట్టలో వేసే డ్యాన్స్ బాగా హైలెట్ అవుతుంది. అనసూయ అందాలు చూసి..స్టార్ డైరెక్టర్లు సైతం సినిమా లో అవకాశం ఇచ్చారు. దీంతో అమ్మడు అటు బుల్లితెర పై ఇటు వెండి తెర పై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

కెరీర్ విషయాలు పక్కన పెడితే…అమ్మడు సోషల్ మీడియాలో లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. కొంచెం టైం దొరికన తన భర్త భరద్వాజ్ ..పిల్లలు తో సమయం గడుపుతుంటుంది. రీసెంట్ గా అనసూయ ..తన భర్త భరద్వాజ్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు తన భర్తని గట్టిగా హగ్ చేసుకోవడం..లిప్ కిస్ ఇవ్వడం వంటి ఫోటోలు ఉన్నాయి. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

తమ పెళ్ళి రోజు సంధర్భంగా..వీరిద్దరు సముద్ర తీరాన రొమాంటిక్ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు సరదాగా గడిపిన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేశారు. భర్తకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు చెప్పుతూ..”21 ఏళ్లుగా కలసి ఉంటున్నాం.. 12 ఏళ్ల వివాహ జీవితం.. నీతో గడిపిన ఇన్నేళ్ళు నా జీవితంలో మర్చిపోలేను. ఇన్నాళ్ళ నీ ప్రేమలో అనేక కోణాలు చూశాను. ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీ మ్యారేజ్ యానవర్సరీ డియర్” అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెకు సోషల్ మీడియా సాక్షిగా విషెస్ చెప్పుతున్నారు అభిమానులు. ఆమె లిప్ లాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Popular