దీంతో మహేష్ – అల్లు అర్జున్ కి విభేదాలకు చెక్ పడినట్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు, అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇతర హీరోల అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కానీ సినీ ఇండస్ట్రీ లో ఉండే అందరూ కూడా సమానమని నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ని పొగుడుతూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు నిర్మాతగా మేజర్ సినిమాని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ గారికి ఈ సినిమా నిర్మించినందుకు నా స్పెషల్ థాంక్స్ అంటూ కామెంట్ చేశారు. మొదటిసారి మహేష్ కు సంబంధించిన చిత్రంపై అల్లు అర్జున్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారుతోంది.. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కారణం 2020 సంక్రాంతి బరిలో దిగిన సినిమాల విషయంలో థియేటర్ గొడవల కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2012 లో అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రం సమయంలో కూడా వీరిద్దరి గొడవకు దారి తీసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక కలెక్షన్ల పరంగా కూడా ఒకరిని మించి మరొకరు పోస్టర్లను విడుదల చేస్తూ ఉండడంతో మహేష్ , అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వస్తుంది అని పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మహేష్ బాబు మాత్రం వీటిని అస్సలు పట్టించుకోరు పుష్ప సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాపై అల్లు అర్జున్ స్పందించలేదు. అసలు ఈ సినిమాకు ఏ హీరో కూడా ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేయలేదు. నేడు అల్లు అర్జున్ మహేష్ నిర్మాతగా ఉన్న మేజర్ చిత్రాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. హీరో అడవి శేషు హీరోయిన్స్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో నటించారు. ఇలాంటి చిత్రానికి నిర్మాతగా ఉన్నందుకు మహేష్ గారికి స్పెషల్ థాంక్స్ ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు అని తెలియజేశారు. మహేష్ ను ఉద్దేశిస్తూ ఇలా ట్వీట్ చేయడంతో ఇద్దరి అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

Share post:

Popular