కన్నడ స్టార్ యష్ క్రేజ్ ను దాటిపోయే ప్లాన్ వేసిన బన్నీ..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF 2 చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రేజ్ ని దాటేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. ముఖ్యంగా కేజిఎఫ్ సినిమా సంచలన విజయం అందుకోగా.. సరికొత్త రికార్డులను సృష్టించి మరింత విజయం సాధించింది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా రెండవ భాగం కోసం ఇప్పుడు దేశమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా చూస్తుంటే కే జి ఎఫ్ సినిమాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప పార్ట్ 2 స్క్రిప్టు లోనూ కూడా మార్పులు చేశారట. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం. పార్ట్ వన్ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా పుష్ప టూ కోసం మరికొంత మంది కొత్త నటులను తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కన్నడ స్టార్ దేవరాజ్ కొడుకు ప్రజ్వల్ దేవరాజ్ ను ఇప్పటికే పుష్ప పార్ట్ 2 కోసం ఎంపిక చేసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ ను కూడా రెడీ చేశారు. పుష్ప 2 క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ని ప్లాన్ చేశారట. కే జి ఎఫ్ 2 క్లైమాక్స్ లో చాప్టర్ 3 ఉంటుంది అన్నట్లు లీడ్ వదిలిన విషయం తెలిసిందే. సరిగ్గా దీన్ని అనుకరిస్తూనే పుష్ప 2 క్లైమాక్స్ లో కూడా ఇలా సర్ప్రైజ్ విడుదల చేయనున్నట్లు అద్భుతంగా డిజైన్ చేశారట. పుష్ప టు తర్వాత ఎండింగ్లో పుష్ప త్రీ కొనసాగింపు ఉంటుందనే హింట్ కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే బన్నీ అభిమానులకు పండగ అని చెప్పుకోవచ్చు.

Share post:

Popular