అడివి శేష్ “మేజ‌ర్‌” మూవీ రివ్యూ & రేటింగ్

టైటిల్‌: మేజ‌ర్‌
నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ
ఎడిటర్: వినయ్ కుమార్ సిరిగినీడి & కోదాటి పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీత దర్శకుడు: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, AMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A ప్లస్ S సినిమాలు
దర్శకత్వం : శశి కిరణ్ టిక్కా
రిలీజ్ డేట్ : 03 జూన్‌, 2022

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా వారం రోజుల ముందు నుంచే భారీ ప్రీమియ‌ర్ల‌తో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
సందీప్‌ ఉన్ని కృష్ణన్ (అడివి శేష్‌) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువ‌కుడు. ఆర్మీలో ప‌ని చేయాల‌న్న కోరిక‌తో ఉంటాడు. తండ్రికి ( ప్ర‌కాష్‌రాజ్‌)కు త‌న కొడుకును డాక్ట‌ర్‌ను చేయాల‌న్న కోరిక ఉంటే త‌ల్లికి ( రేవ‌తి) కి త‌న కొడుకును ఇంజ‌నీరింగ్ చేయాల‌న్న కోరిక ఉంటుంది. అయితే చివ‌ర‌కు తాను అనుకున్న‌ట్టుగానే కృష్ణ‌న్ ఆర్మీలో చేర‌తాడు. త‌న స్కూల్‌ రోజుల్లో ఇష్టపడిన ఇషా(సయీ మంజ్రేకర్‌)ని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఎక్కువ టైం ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి విడాకుల వ‌ర‌కు వెళ‌తారు.

త‌న‌కు ఇళ్లు, కుటుంబం కంటే దేశం ఎక్కువ అని భావించే సందీప్ సైన్యంలో ఎదిగి భార‌త సైన్యంలో టాప్ ర్యాంక్ అయిన ఎన్ఎస్‌జీ క‌మాండోల‌కు శిక్ష‌ణ ఇచ్చే రేంజ్‌కు వెళ‌తాడు. తాను ఇంటికి వెళ్లేందుకు బ‌య‌లు దేరుతున్న క్ర‌మంలో ముంబై తాజ్ హోట‌ల్‌పై ఉగ్ర‌దాడి జ‌రుగుతుంది. అప్పుడు త‌న ప్ర‌యాణం ర‌ద్దు చేసుకుని తన బృందంతో ఆప‌రేష‌న్ ప్లాన్ చేస్తాడు ? సామాన్య ప్ర‌జ‌ల‌ను రక్షించే క్ర‌మంలో త‌న ప్రాణాల‌ను ఎలా ? ప‌ణంగా పెట్టాడు అన్న‌దే ? ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డం అంటే చాలా స‌వాల్‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఎక్కువైతే మొద‌టికే మోసం. ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే డాక్యుమెంట‌రీ అవుతుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క‌. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలియని విషయాలను భారతీయ ప్రేక్షకులకు తెరపై చూపించాడు.

అత‌డి బాల్యం, ప్రేమ‌, య‌వ్వ‌నం ల‌వ్ స్టోరీ.. ప్రాణాల‌కు తెగించి ఉగ్ర‌మూక‌ల‌ను మ‌ట్టుబెట్ట‌డం ఇవ‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించాడు. తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడితో ఫస్టాఫ్‌కి బ్రేక్‌ ఇచ్చాడు. సెకండాఫ్‌లో మొత్తం 26\11 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్‌ హోటల్‌లో ఉగ్రవాదులు చేసిన అరచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్‌ ఉన్నికృష్ణన్‌ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలు ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డం ప్ర‌తీది థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

హోటల్‌లో దాగిఉన్న సాధారణ యువతి ప్రమోదరెడ్డి( శోభిత ధూళిపాళ), ఓ చిన్న పిల్లను కాపాడడం కోసం పడిన పాట్లు ఆకట్టుకుంటాయి. ఇక చివరి 20 నిమిషాలు మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌ రాజ్‌ స్పీచ్‌.. ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. మొత్తంగా మేజర్‌ అందరూ చూడాల్సిన సినిమా.

ఎవ‌రెలా చేశారంటే…
మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ నటించడం కంటే జీవించాడు అనే చెప్పాలి. ఈ పాత్ర కోసం శేష్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక పేరెంట్స్‌ ప్రేమను నోచుకొని ఉన్నత కుటుంబానికి చెందిన ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్‌ ఒదిగిపోయింది. సందీప్‌ తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ అద్భుతంగా నటించాడు. రేవ‌తి, శోభిత త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల బీజీఎంతో గూస్‌ బంప్స్‌ తెప్పించాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా…
దేశ‌భ‌క్తి మేళ‌వించిన ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామా మేజ‌ర్‌

మేజ‌ర్ రేటింగ్ : 3.25 / 5

Share post:

Latest