బ్లాక్ బస్టర్ డైరెక్షన్ లో మరో ఐటెం సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్..హీరో ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో ఐటెం సాంగ్ చేయనుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే..సమంత స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికి..పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ,,రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రంలో సమంత ఫస్ట్ టైం ఐటెం నెంబర్ ఓకే చేసి సంచలనంగా మారింది. పుష్ప సినిమా విజయానికి సమంత అందాలు ప్లస్ అయ్యాయని ఆ టైంలో అంతా అనుకున్నారు.

- Advertisement -

సినిమా రిలీక్ అయ్యి అరు నెలలు పైనే కావస్తున్న ఇప్పటికి ఈ పాట యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. “ఊ అంటావా మావ..ఊ అంటావా మావా” అంటూ వచ్చే ఈ పాట అప్పట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. అయితే, తాజాగా సమంత మరో సారి ఐటెం సాంగ్ లో చిందులు వేయడానికి సిద్ధపడ్డిన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నా సామ్..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా లో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు మీడియాలో వారతలు వైరల్ అవుతున్నాయి.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప రెడ్డి వంగా..రీసెంట్ గా తెరకెక్కిస్తున్న చిత్రం “యానిమల్” . బాలీవుడ్ బడా హీరో రణబీర్ కపూర్-రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లు గా నటిస్తున్న ఈ యానిమల్ చిత్రంలో సామ్ వేడెక్కించే ఐటమ్ నంబర్ లో నటించనుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే సామ్ తో దర్శకుడు సందీప్ వంగా చర్చించారని.. ఫైనల్ డీల్ లాక్ అయ్యిన్నట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సమంత ఐటమ్ నంబర్ కి ఓకే చెప్పడం పై సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లు మొదలైయాయి.

ప్రస్తుతం సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరో పక్క సామ్..టాలీవుడ్ లో విజయ్ తో, హాలీవుడ్ సినిమాలో, కోలీవుడ్ లో విజయ్ తో ఇలా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యి ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత బాలీవుడ్ చిత్రంలో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేయాలనుకుంటున్నట్లు డైరెక్ట్ గానే చెప్పేసింది. ఇలాంటి టైంలో సమంత ఐటెం సాంగ్ అంటూ వార్తలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular