ఆయనతో ఉంటే అదో తెలియని ఫీలింగ్ ..చైతన్య పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి స్ధానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మడు ఓ లేడీ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లు ఉండి అలాంటి క్రేజ్ ను తెచ్చుకున్నారు . అలాంటిది సాయి పల్లవి అతి కొద్ది టైంలోనే ఇలా స్దానాన్ని సంపాదించుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

- Advertisement -

సాయి పల్లవి ని జనాలు ఇష్టపడడానికి కారణం ఆమె స్ట్రైట్ ఫార్వాడ్ మాటలు. ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతుంది . కానీ, ఎవ్వరి మనసును హర్ట్ చేయదు నొప్పించదు. సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసే హీరోయిన్స్ ఈ రోజుల్లో ఎంత మంది ఉన్నారు . ఫింగర్ కౌంటింగ్స్ కూడా రారు. ఆ లిస్ట్ లో సాయి పల్లవి ఫస్ట్ లో ఉంటుంది. అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..కధ నచ్చకపోతే..నో చెప్పేసే గట్స్ ఉన్న ఆడపులి ఈ సాయిపల్లవి.

అయితే, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పుతూ..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని లీక్ చేసింది. సాయి పల్లవి తెలుగులో వరుణ్ తేజ్, రానా, నాని, శర్వానంద్, నాగ చైతన్య లాంటి హీరోలతో నటించినా ..కానీ తనకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం రానా, చైతన్యనే అంటూ చెప్పుకొచ్చింది. వాళ్లతో ఉంటే నాకు అస్సలు టైం తెలియదని. రానా చాలా మంచి అబ్బాయి అని..విరాట పర్వం సినిమా టైంలో తనకు ఎంతో హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చిన సాయి పల్లవి..తన పట్ల చైతు చాలా కేరింగ్ గా ఉంటాడంటూ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది. వీరిద్దరితో ఉంటే ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఉంటుందని సాయి పల్లవి పేర్కొంది.

Share post:

Popular