మహేశ్ సినిమాలో ఫ్రెష్ బ్యూటీ..మరి అందుకు ఒప్పుకుంటుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు..ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈ హీరో..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లో 28 వ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పారంభం కానున్నాయి.

ఈ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..6 నెలలులో కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చారట. అంటే సుమారు ఈ ఏడాది ఆఖరిలోపు ఈ సినిమా ను కంప్లీట్ చేసి..ప్యాకప్ చెప్పేసి..తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమాలో అంతీంచనున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆఫ్రికా అడవుల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

కాగా, మహేశ్ తన సినిమాలో ఈసారి కొత్త బ్యూటీ తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో తెరకెక్కబోతున్న త్రివిక్రమ్ సినిమాలో ఆల్రెడీ పూజా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. కానీ , కధ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని.. సినిమా లో మహేశ్ కు మరదలిగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్న మాటల మాత్రికుడు..ఫైనల్ గా ఫ్రెష్ బ్యూటీని ఫైనల్ చేశాడట.

నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ మొహన్ ను ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఆమె అయితే మహేశ్ మరదలిగా బాగా సూట్ అవుతుందని డైరెక్టర్ భావిస్తున్నారట. ఫేస్ లో అమాయకత్వం..ట్రెడిషినల్ లుక్స్ లో ప్రియాంక అయితే బాగుంటుందని అంటున్నారు. కానీ, ఈ సినిమాలో ఆమె పాత్ర తక్కువుగా ఉంటుందట. కేవలం 20 నిమిషాలే ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇంత తక్కువ టైం ఉన్న క్యారెక్టర్ కి ఆమె ఒప్పుకుంటుందా ? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రియాంక కి తెలుగులో పెద్ద సక్సెస్ అవ్వలేదు..ఈ క్రమంలో మహేశ్ సినిమా హిట్ అయితే..ఖచ్చితంగా అమ్మడు కెరీర్ కి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular