ఆ డైరెక్టర్ వల్ల పార్వతీమెల్టన్ లాగే మరో స్టార్ హీరోయిన్ కాబోతోందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ విభిన్నమైన కథలతో కూడిన సినిమాలకు పెట్టింది పేరు. ఈయన డైరెక్షన్లో సినిమా చేశారు అంటే చాలు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటీనటులు. చివరిసారిగా డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ చిత్రానికి డైలాగులు అందించి ఆ చిత్రాన్ని కూడా విజయ బాట పట్టేలా చేశాడు.

ఇక ఇప్పుడు తాజాగా మహేష్ బాబుతో కలిసి ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతోందని చిత్రబృందం తెలిపారు. అంతేకాదు ఈమెతో సినిమా పూజా కార్యక్రమాలు చేయించారు. ఇక దాదాపుగా 10 సంవత్సరాల పైన మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 28 వ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి కేవలం..SSMB -28 అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారని మహేష్ వెనక్కు తిరిగి వచ్చిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు తెలియజేశారు చిత్రబృందం. ఇక ఇందులో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఖరారు చేశారు.. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే మహేష్ సరసన పూజా హెగ్డే ని తొలగించి ఆమె స్థానంలో తమిళ హీరోయిన్ అయిన ప్రియాంక అరుల్ మోహన్ తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె కున్న క్రేజ్ ను ఆలోచించి త్రివిక్రమ్ కూడా తన తదుపరి సినిమాలు ఏమన్నా తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో కూడా హీరోయిన్ పార్వతి మెల్టన్ ను కూడా బాగా పాపులర్ చేసి ఆమెను మధ్యలో వదిలేయడం జరిగింది.. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే ని స్టార్ హీరోయిన్ గా చేసిన త్రివిక్రమ్ ఈమెను కూడా ఇలా చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Share post:

Latest