నాని భార్య అన్ని సీక్రెట్స్ చెప్పేసింది… బాంబు పేల్చిన న‌జ్రియా…!

హీరోయిన్ నజ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజా రాణి చిత్రం ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారిగా తెలుగులో డైరెక్టుగా “అంటే సుందరానికి” వంటి సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఇక ఈమె అందంతో పాటు అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈమె కెరీర్ మొదలు పెట్టి పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంతవరకు డైరెక్టుగా ఒక తెలుగు సినిమాలో కూడా నటించలేదు.

కానీ తమిళంలో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి చిత్రం తో మొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి డైరెక్టుగా సినిమాలు చేస్తోంది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు చిత్రబృందం.

ఇందులో భాగంగానే నిన్నటి రోజున రాత్రి ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ వేడుక పై హీరోయిన్ నజ్రియా కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది.. వైజాగ్ గురించి నాని భార్య ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఆమెది కూడా వైజాగ్ నే.. సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో.. సినిమా పట్ల మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది అంటూ తెలియజేసింది.

ఈ ఏడాదిగా తనకు ఎన్నో మంచి విషయాలు జరిగాయని.. ఒకటి నేను డైరెక్ట్ గా తెలుగులో నటించడం.. రెండవది వైజాగ్ రావడం , తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం అంటూ నజ్రియా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చింది. తనతో నటించిన యాక్టర్ లలో హీరో నాని కూడా ఒక మంచి యాక్టర్.. తన కారణంగా ఈ సినిమాకు సంబంధించి మంచి జ్ఞాపకాలు మిగిలాయని ఈ చిత్రం జూన్ 10న విడుదల అవుతోందని తప్పకుండా చూడండి అని తెలియజేసింది.

Share post:

Popular