కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతోనే..కమల్ సినిమాతో కాదట..?

కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతోనే..కమల్ సినిమాతో కాదట..? అవును ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నందమూరి హీరో సినిమాతోనే. కళ్యాణ్ రామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ తన సినిమాల ద్వారా ఎక్కువగా కొత్తవారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. అలా పరిచయం చేసిన వారిలో కాజల్ ఒకరు. మొదటి సినిమా హిందీలో అయినా కాజల్ స్టార్ హీరోయిన్‌గా వెలిగింది మాత్రం సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనే.

తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కాజల్ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన బృందావనం, బాద్‌షా, టెంపర్ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు, జనతా గ్యారేజ్ సినిమాలోనూ, ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది కాజల్. అయితే, యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, నాగార్జున, తమిళంలో అజిత్ లాంటి వారి సరసన నటించిన ఈ చందమామ నట సింహం సరసన మాత్రం స్క్రీన్ షేర్ చేసుకుంది లేదు.

వాస్తవంగా మూడు నాలుగుసార్లు కాజాల్‌కు బాలయ్యతో కలిసి హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది కానీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మిస్ అయింది. ఇక పెళ్లి తర్వాత గర్భం దాల్చిన కాజల్ ఆచార్య, నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ సినిమాల నుంచి తప్పుకుంది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, కాజల్ కమిటైన సినిమాలలో కమల్ సరసన నటిస్తున్న ఇండియన్ 2 నుంచి మాత్రం తప్పుకోలేదు. త్వరలో ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే కాజల్ మళ్ళీ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతో ఇవ్వబతుందని ఇన్‌సైట్ టాక్. అది కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రావిపూడి బాలయ్యతో తీయబోయో సినిమా ద్వారా అట. ఇదే కాదు, పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబోలో తెరకెక్కబోయో సినిమాలో కూడా కాజల్ అయితే బాలయ్య సరసన బావుంటుందని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే పూరి బిజినెస్ మేన్, టెంపర్ సినిమాలలో కాజల్ నటించింది. కాబట్టి బాలయ్య సరసన నటించే అవకాశాలు మెండుగానే ఉన్నాయంటున్నారు.

Share post:

Popular