ప్రభాస్ చిత్రాలనే రిజెక్ట్ చేసిన కాజల్.. కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా పేరు ఉన్నది. ఇక ప్రభాస్ ఏ హీరోయిన్ తో నటించినా సరే సరిపడు జోడి కాంబినేషన్ గా కనిపిస్తూ ఉంటారు. అలా ప్రభాస్ – కాజల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని ఎంతోమంది అభిమానులు సైతం కోరుకున్నారు.

అయితే ఈ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో కూడా నటించలేదు. ప్రభాస్ రెండు చిత్రాలను కాజల్ రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంలో తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం చిత్రబృందం మొదట కాజల్ ని సంప్రదించారట అయితే కాజల్ మాత్రం రెబల్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ తర్వాత తమన్నాని ఎంపిక చేయడం జరిగింది.

ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో చిత్రంలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది.. కాజల్ ఈ ఆఫర్ కి కూడా నో చెప్పడం గమనార్హం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కాజల్ రిజెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. కథల విషయంలో కాజల్ జడ్జిమెంట్ ఎంతో ఫర్ఫెక్ట్ అనే విషయం ఈ ఘటనతో ఫ్రూప్ అవుతోందని చెప్పవచ్చు. ఎక్కువ మంది హీరోయిన్లు సైతం వారికి నచ్చిన అభిమాన నటులు తో నటించే అవకాశం రాగానే కచ్చితంగా ఓకే చెప్పేస్తూ ఉంటారు .కానీ అందులో వారి ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తూ ఉండదని చెప్పవచ్చు.

Share post:

Popular