బాల‌య్య – కాజ‌ల్ కాంబో ఈ కార‌ణంతోనే సెట్ కాలేదా…?

హీరోయిన్ కాజల్ గురించి ప్రస్తావన అవసరం లేదు. అలాగే బాలయ్య పరిచయం అస్సలు అక్కర్లేదు. జూనియర్ స్టార్లనుండి సీనియర్ స్టార్లవరకు ఎవరిని వదిలి పెట్టలేదు కాజల్. అలాగే బాలయ్య తెలుగు పరిశ్రమలోని అందమైన హీరోయిన్లను ఎవరిని విడిచిపెట్టలేదు. అలాంటిది బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన వీరిద్దరి కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు.

బాలయ్య కాజల్ కాంబోలో సినిమా రాకపోవడానికి కాజల్ అగర్వాల్ ఆఫర్లను తిరస్కరించడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో నటి నుండి గుసగుసలు వినబడుతున్నాయి. మొదటగా బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల కోసం దర్శకులు కాజల్ ను సంప్రదించారట. ఆ సమయంలో చందమామ కాజల్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నానంటూ డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పిందట.

ఇక దాని తరువాత కూడా వీరి కాంబినేషన్ కోసం నిర్మాతలు ఎదురు చూశారట. మరి ఎందుకోగానీ వారి కాంబినేషన్ సెట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆ కాంబినేషన్ ని ఇక చూడలేమనే అనిపిస్తోంది. ఎందుకంటే కాజల్ గత ఏడాది చేసుకొని, తల్లి కూడా అయిపోయింది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాలకు సైన్ చేయడం లేదని భోగట్టా. ఓ వైపు బాలయ్య అభిమానులు మాత్రం వీరి కాంబినేషన్ ని చూడాలని కలలు కంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి మరి.

కాజల్ మెగాస్టార్ తో ఖైదీ నెం 150లో నటించిన సంగతి తెలిసినదే. దాని తరువాత కూడా మొన్న రిలీజైన చిరు – కొరటాల సినిమాలో కాజల్ నటించాల్సి వుంది. అయితే హీరోయిన్ పాత్ర అవసరంలేదంటూ ఆమెని పక్కన బెట్టారు. లేదంటే వీరి కాంబోలో ఈపాటికి రెండు సినిమాలు వచ్చి ఉండేవి. ఈ విషయం కూడా బాలయ్య అభిమానులను కలచి వేస్తోంది. చిరుతో నటించిన కాజల్ బాలయ్యతో ఎందుకు నటించిందని ఒకింత గుర్రుగా వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular