హీరోయిన్లు అలా కనిపించేందుకు ఇలాంటి ఇంజక్షన్ చేయించుకుంటారా.. సినిమా సీక్రెట్స్‌ రివీల్ చేసిన ఆ నటి!

ఈ రోజుల్లో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇక హీరోయిన్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అట్రాక్టివ్‌గా కనిపించేందుకు వీరు ఒక అడుగు ముందేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, శ్రుతి హాసన్ వంటి ఎందరో టాప్ హీరోయిన్లు ఫేస్ సర్జరీలు చేయించుకున్నారు. ఈ హీరోయిన్లు ఈ సర్జరీల గురించి నిర్మొహమాటంగా బయట పెట్టారు కూడా. బ్యూటిఫుల్‌గా కనిపించేందుకు సర్జరీ చేయించుకుంటే ఏంటట అని వీరు విమర్శకుల నోళ్లు మూయించారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ అందం గురించి ఎంత దారుణమైన కామెంట్స్ చేస్తారో తాజాగా ఒక కుర్ర హీరోయిన్ బయటపెట్టి షాకిస్తోంది. ఈమె కామెంట్స్ విన్న తర్వాత హీరోయిన్ లు ఎందుకు సర్జరీల వైపు మొగ్గు చూపుతారో అర్థమవుతోంది.

ఇంతకీ ఆమె మరెవరో కాదు వినయ విధేయ రామ మూవీలో ఏక్ బార్ ఐటమ్ సాంగ్‌లో మెరిసిన ఈషా గుప్తా. తాజాగా ఈ హాట్ భామ మూవీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందంగా కనిపించాలని హీరోయిన్లపై సినిమా వాళ్లు ఎంత ఒత్తిడి చేస్తారో ఆమె వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయం నుంచి తన అందం గురించి అడుగడుగునా విమర్శలే ఎదురయ్యాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ముఖచర్మం తెల్లగా, అందంగా, మెరిసేలా కనిపించేందుకు ఒక ఇంజక్షన్ కూడా తీసుకోవాలని తనని పదేపదే విసిగించినట్లు ఆమె తెలిపింది.

ముక్కు కూడా గుండ్రంగా… అసలు బాగోలేదని.. దానిని షార్ప్ గా చేయించుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఒకానొక సమయంలో ఇంజక్షన్ తీసుకోవాలనే ఆలోచన వచ్చి దాని గురించి ఆరా తీస్తే ధర రూ.9 వేలు అని తెలిసినట్లు వెల్లడించింది. ఇండస్ట్రీలో పడే మాటల వల్ల చాలా మంది హీరోయిన్లు ఈ ఇంజక్షన్ తీసుకున్నారని కానీ వారి పేర్లను బయటపెట్టనని చెప్పింది. ఈషా గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారాయి.

Share post:

Popular