పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లికి అదే అడ్డంకిగా మారిందా..?

టాలీవుడ్ యాక్టర్ నరేష్ బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి కామెడీ సినిమాలతో హీరోగా మారి ఎంతగానో మెప్పించాడు. జంబలకడిపంబ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కాస్త వయసు పైబడ్డాక హీరోలకి తండ్రిగా, బాబాయ్ గా ఇంకా అనేక క్యారెక్టర్లలో నటిస్తూ ఇప్పటికీ మెప్పిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా నరేష్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, నరేష్ సీనియర్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది.

నిజానికి నరేష్ గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకొని, వారికి విడాకులు ఇచ్చినట్లు అందరికీ తెలుసు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నరేష్ నాలుగో పెళ్లి అని చర్చ జరుగుతోంది. మరి నరేష్ పెళ్లి చేసుకున్న ఇంకో మహిళ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. నరేష్ విజయనిర్మల ఉన్న కాలంలో ప్రముఖ రచయత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను పెళ్లి చేసుకున్నాడు. రేఖ నరేష్‌తో కలిసి ఒక పండంటి బాబుకు జన్మనిచ్చింది. అప్పటినుంచి వారి మధ్య విభేదాలు రావడంతో వారు విడాకుల బాట పట్టాల్సి వచ్చింది.

ఆ తర్వాత నరేష్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తమ్ముడి కూతురైన రమ్య రఘుపతిని నరేష్ పెళ్ళాడాడు. రమ్య సినిమాలపై మక్కువతో ఒక డైరెక్టర్ వద్ద పనిచేస్తుండగా నరేష్‌తో పరిచయమైంది. విజయనిర్మల వద్ద కో-డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే వీరి మధ్య కలతలు రావడంతో ఆ పెళ్లి కూడా ఎంతో కాలం నిలవలేదు. అయితే నరేష్ ఇంకొక భార్య ఎవరు, ఆమె ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు చాలామంది మెదళ్లను తొలిచేస్తోంది.

పెళ్లికి అదే అడ్డంకిగా మారిందా..?
ఇదిలా ఉండగా నరేష్ ప్రస్తుతం ప‌విత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకోవాలి కోరుకుంటున్నా, ఒక విషయం మాత్రం అడ్డంకిగా మారిందని ఫిల్మ్ నగర్‌లో అనుకుంటున్నారు. అదేంటంటే, ప‌విత్రా లోకేష్ సుచేంద్ర ప్ర‌సాద్ తో 2007లో మ్యారేజ్ చేసుకుందని కానీ అతడి నుంచి అధికారికంగా విడాకులు తీసుకోలేదని మాట్లాడుకుంటున్నారు. మ‌న‌స్ప‌ర్దల వల్ల వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నా.. ఇప్పటికైతే లీగల్‌గా విడిపోలేదట. దీంతో పవిత్ర అధికారికంగా విడాకులు తీసుకునేంతవరకు నరేష్ పెళ్లి జరగదని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కాకపోయినా వీరిద్దరూ చాలా కాలంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కూడా భోగట్టా.

Share post:

Popular