జాతర కోసం రెడీ అంటోన్న రౌడీ స్టార్..

టాలీవుడ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 2న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్‌గా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్‌లో మహేష్ లుక్స్, యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఇక ఈ ట్రైలర్‌పై పలువురు సెలబ్రిటీలు కూడా తమ రెస్పాన్స్ ఇచ్చారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉందని, మహేష్ బాబును ఇలా చూసి చాలా రోజులయ్యిందని, మాస్ జాతరకు అందరం రెడీగా ఉన్నామంటూ సర్కారు వారి పాట సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఏదేమైనా సర్కారు వారి పాట ట్రైలర్ మహేష్ ఫ్యాన్స్‌కు పిచ్చ కిక్కిచ్చిందని వారు అంటున్నారు.

Share post:

Latest