డబ్బు కోసం దిగజారిపోయిన అలియా..ఎంత దారుణం అంటే..వీడియో చూడండి..!!

అలియా భట్..అబ్బో ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో మారు మ్రోగిపోతుంది. అందానికి అందం..నటనకి నటన, పైగా స్టార్ కిడ్..ఇక ఇండస్ట్రీలో ఎలాంటి ప్లేస్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అనుకుంటా. అమ్మడుని ఓ రేంజ్ లో పాపులర్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్స్. తెలుగులో ఆమె నటించిన RRR సినిమా మంచి విజయం అందుకుంది..ఈ సినిమాలో ఆమె పాత్ర తక్కువే అయినా.. చేసిన పది నిమిషాలు సూపర్ అంటూ ఆడియన్స్ దగ్గర మంచి మార్కులే వేయించుకుంది. ఇక గంగూభాయ్ కతియవాడీ సినిమాలో అయితే తన నట విశ్వ రూపం చూయించింది.

ఆ సినిమా చూస్తున్నంత సేపు..అలియా ని పర్చిపోయారు అందరు.. గంగూభాయ్ గానే ఊహించుకున్నారు. కనురెప్ప వేయనీకుండా..సెకండ్ కూడా సుత్తి కొట్టించకుండా రియలిస్టిక్ గా చూయించారు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమాతో బాలీవుడ్ లో అమ్మడు రేంజ్ పెరిగిపోయింది. పీగా స్టార్ హీరో రణ్ బీర్ ని పెళ్లి చేసుకుని..ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అలియా పై నెటిజన్స్ మండిపడుతున్నారు . నీకు బుద్ధి ఉందా అంటూ తిట్టిపోస్తున్నారు. దానికి కారణం ఆమె చేసిన పనులే.

మనకు తెలిసిందే హీరోయిన్స్ తమ బాడీనీ ఫిట్ గా ఉంచాలని అనుకుంటారు. దీనికోసం పక్క డైట్ ఫాలో అవుతారు. అలియా కూడా అదే కోవాలోకి వస్తుంది. గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ కోసం “కపిల్ శర్మ” షోకి వెళ్లిన అలియా కి అక్కడ చక్కెర వేసిన కాఫీ ఇస్తే..పెద్ద క్లాస్ పీకుతుంది. చక్కెర తినకూడదు అని..అది హెల్తీ కాదు అని,.ఓ స్లో పాయిజన్ అని చక్కెర నేను తీసుకోను అని..ఓన్లీ ప్రూట్స్ తీసుకుంటా”అని చెప్పుతుంది. కానీ, అలియా నటించిన యాడ్స్ పై లుక్ వేస్తే అన్ని చక్కెర ఉండే అన్ హెల్తీ ఫుడ్స్. అలియా నటించిన ‘ఫ్రూటీ, కోకా కోలా, కార్నెటో ఐసీ క్రీమ్’ యాడ్‌తో కంపేర్ చేసిన నెటిజన్స్ నెట్టింట ఆమె పై ట్రోల్స్ మొదలుపెట్టారు. ‘డబ్బుల కోసం ఇంత దారుణంగా ఉంటావా నువ్వు అలియా అంటూ మండిపడుతున్నారు. అంతేనా పాయిజన్ తీసుకోమని యాడ్స్‌లో నటిస్తావా..బుద్ది ఉందా’ అని ఫైర్ అవుతున్నారు. మరికొందరు ‘పైసల కోసం ప్రాణాలతో ఆడుకుంటావా?’ అంటూ బూతులు తిడుతున్నారు.

Share post:

Latest