సూర్య రెండు పెళ్లిలు చేసుకున్నాడనే విషయం మీకు తెలుసా..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య..ఈ పేరు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలాంటి స్దానాని సంపాదించుకున్నాడు ఈ హీరో. పేరు కి తమిళ హీరో అయినా..ఆయన నటించిన సినిమాలను తెలుగు లో కూడా డబ్ చేస్తూ..ఇక్కడ రిలీజ్ చేస్తూ..మంచి మర్కెట్ తెచ్చుకున్నాడు. అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు. నిజం చెప్పాలంటే మన తెలుగు హీరోల కన్నా కూడా సూర్య సినిమాలు బాగా ఆదరిస్తారు జనాలు..అంత బాగా అట్రాక్ట్ చేస్తాడు సూర్య.

ఇక ఎప్పుడు ఒక్కే జోనర్ లో సినిమా తీయ్యకుండా..కొత్తగా ఆలోచించి డిఫరెంట్ స్టైల్ ఉన్న సినిమాలకే సైన్ చేస్తాడు సూర్య. ఆయన నటించిన జై భీమ్ సినిమా చూసిన వాళ్ళు సూర్య నటనకి చేతులు ఎత్తి దండపెట్టారు. అంత బాగా క్యారెక్టర్ లో లీనమైపోతాడు ఈ హీరో. అయితే, సినిమా ల పరంగా ఎలా హీరోగా సక్సెస్ అయ్యాడో..రియల్ లైఫ్ లోను లవ్ లో అలాగే సక్సెస్ అయ్యాడు.

మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ జ్యోతిక ను సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు . ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య మాటలు కలిసి ..అది ఫ్రెండ్ షిప్ గా మారి..చివరికి లవ్ చేసుకుని..ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇక్కడ చాలా మందికి తెలియని ఓ విషయం ఉంది. సూర్య-జ్యోతికలు ప్రేమించుకున్న రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకునేశారట. సూర్య ఇంట్లో ఒప్పుకోరు అనే భయంతో ముందే ఎవ్వరికి తెలియకుండా తాళ్లి కట్టెశాడట. ఆ తరువాత కొన్నాళ్లకి ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలియడంతో..ఇక ఏం అనలేక..జ్యోతికని కోడలు గా ఆహ్వానిస్తూ..మళ్ళీ పెద్దల సమక్షంలో జ్యోతిక మెడలో మూడు ముళ్లు వేసారట సూర్య. అలా రెండు సార్లు తాను ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఈ కోలీవుడ్ హీరో. ఇప్పుడు వీళ్లకి ఇద్దరు పిల్లలు..చాలా సంతోషంగా ఉన్నారు.

Share post:

Popular