సమంత ఇంత కాస్ట్లీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందా ?

మాయాజాల ప్రపంచం సినీ పరిశ్రమలో ఒక్కసారి క్లిక్ అయితే వారి ఫేటే మారిపోతుంది, వారి లైఫ్ స్టైలే మారిపోతుంది. ఇక్కడ కాసుల వర్షమే కాదు, పబ్లిసిటీ కూడా చాలా కామన్ సెలబ్రేటీ అంటే ఆ కిక్కే వేరప్ప అందుకే చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలని ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుంటారు. ఇక బిగ్ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, వారి లైఫ్ చాలా లక్జరీగా కాస్ట్లీ గా ఉంటుంది. వారు వేసుకునే దుస్తుల నుండి వాడే కాస్మోటిక్స్, కార్స్, హౌజ్, ఫామ్ హౌస్ , ఫోన్స్ ఇలా అన్ని కూడా చాలా కాస్ట్లీ గాను లక్సరి గాను ఉంటాయి. అయితే ఇపుడు మనం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లక్సరి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుని అవాక్ అవుదాం పదండి. ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సామ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయారు.

అలా తొలి పరిచయం లోనే అత్యదిక పారితోషకాన్ని అందుకుంటూ వచ్చిన సామ్ ఆస్తులను కూడా బాగానే వెనకేసుకున్నారు. కర్ణాటక, ఆంధ్ర ,తెలంగాణ, చెన్నై రాష్ట్రాలలో పలు చోట్ల స్థిరాస్తులను కొనుగోలు చేశారు సామ్. ముఖ్యంగా చెన్నై మరియు హైదరాబాద్ లో ఆమెకు విలాసవంతమైన ఫామ్ హౌజ్ లు, విల్లాలు , ల్యాండ్ లు ఉన్నాయి. అంతేకాదు ముంబై నగరం లోనూ ఒక ఫ్లాటు ను, అలాగే ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక లక్సరి లైఫ్ అంటే సమంత లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనేలా ఆమె తన లైఫ్ చాలా కాస్ట్లీ గా లీడ్ చేస్తున్నారు. ఆమె వాడే చొప్పులు కూడా లక్షలు విలువ చేస్తాయి అంటే ఆమె ఏ రేంజ్ లక్సరి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్స్, వేసుకునే నగలు ఇలా అన్ని కూడా లక్షల విలువ చేసేవే.

ఇక సమంత వేసుకునే కాస్ట్యూమ్స్ సో స్పెషల్ అనే చెప్పాలి. పొట్టి దుస్తులే అయినా ఆ అతుకు ముక్కలను డిజైన్ చేయడానికి ఒక్కో డ్రెస్ కు లక్షలు పోస్తారట సామ్. అయితే ఇటీవల ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఆమె దుస్తులు మరీ అసభ్యకరంగా ఉంటున్నాయి అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కానీ ఆ డ్రెస్సులు అన్ని కూడా చాలా వరకు దగ్గరుండి మరీ స్పెషల్ బెస్ట్ డిజైనర్స్ తో లక్షలు ఖర్చు పెట్టి డిజైన్ చేయించుకుంటారట సమంత. ఇక ఈమె వాడే కార్లు అయితే కోట్లల్లో మాటే… అంతా కాస్ట్లీ కార్లు అన్నమాట. ఈమె దగ్గర కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. సమంత దగ్గర 2.26 కోట్ల విలువ చేసే రేంజ్ రోవ‌ర్ అనే కాస్ట్లీ కారు ఉంది. అలాగే 1.46 కోట్లు విలువ చేసే స్వాంకీ పోర్చే కేమ‌న్ కారు కూడా సామ్ గ్యారేజ్ లో ఉంది.

అలాగే సమంత వద్ద 83 ల‌క్ష‌లు విలువ చేసే ఆడి క్యూ 7 కారు, మరియు 75 లక్షలు విలువ చేసే జాగ్వార్ ఎక్స్ ఎఫ్ కార్లు కూడా సమంత వద్ద ఉన్నాయి. ఈమె కార్ల లిస్ట్ చూస్తే సామ్ ఎంత లక్సరి లైఫ్ ను లీడ్ చేస్తున్నారో అర్దం అవుతుంది. ఎన్నో లక్షలు విలువ చేసి కొన్న డ్రెస్ అయినా సరే ఒకసారి వేసుకున్న బట్టలను మరొకసారి వేసుకోరట సమంత. ఎదో కొన్ని ఫేవరెట్ దుస్తులు తప్పితే మిగిలినవన్నీ పనివాళ్లకు ఇచ్చేస్తారట.

Share post:

Latest