RRR MOVIE: ట్రైన్ బ్లాస్ట్ సీన్ వెనక ఇంత కష్టం ఉందా..ఎలా తెరకెక్కించారో తెలుసా..!

రణం రౌద్రం రుధిరం..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఇండియన్ సినిమా లెక్కలను తిరగ రాసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమాలకు కొత్త వైభవం తీసుకొచ్చింది. ఏకం గా ఇద్దరు బడా స్టార్స్ ని పెట్టి..చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్నో ఎలివేషన్‌ సీన్స్‌ బాగా చూయించాడు జక్కన్న.

కలెక్షన్స్ పరంగా కూడా సినిమా అధ్బుతమైన రికార్డులను నెలకొల్పింది. అయితే కేవలం ఇద్దరు హీరోల నటన మాత్రమే కాదు అటు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి ప్రాణం పోసిందని అని చెప్పాలి.అయితే, సినిమా లో చాలా మంది కొన్ని సీన్స్ ఫేవరేట్ గా మారిపోయాయి. అవి VFSX ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారని తెలిసినా..ఎలా డిజైన్ చేసారో ..రాజమౌళి ఎలా ఊహించుకుని ఆ సీన్స్ తెరకెక్కించారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. ఈ క్రమంలోనే సినిమాలో కొన్ని సీన్స్ ఎలా క్రియేట్ చేసి..తనదైన స్టైల్ లో రాజమౌళి తెరకెక్కించారో ..సోషల్ మీడియా వేదిక గా పంచుకుంటున్నారు DVV ఎంటర్ టైన్ మెంట్స్.

ఈ క్రమంలోనే చరణ్-తారక్ కలిపే ట్రైన్ బ్లాస్ట్ సీన్ కు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్‌ వర్క్‌ కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఆయా సన్నివేశాల్లో Alzahravfx సంస్థ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎలా క్రియేట్‌ చేసిందో తెలుపుతూ యూట్యూబ్ లో ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేసారు DVVఎంటర్ టైన్మెంట్స్. కాగా, ఆ వీడియో ని చూసిన జనాలు..రాజమౌళి వర్క్ కి, ఆయన డెడికేషన్ , ఆయన ప్లానింగ్ కి హ్యాట్సాఫ్ చెప్పుతున్నారు. సినిమా లో ఒక్కో సీన్ కోసం ఆయన పడిన కష్టం కళ్ళకు కట్టిన్నన్నట్లు క్లీయర్ గా తెలుస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ ట్రైన్ బ్లాస్ట్ సీన్ కోసం వీఎఫ్‌ఎక్స్‌ ఎంత కష్టపడ్డారో..ఎలా క్రియేట్‌ చేసారో ఈ క్రింది వీడియో లో మీరు చూసేయ్యండి.