ఏడడుగులు వేయబోతున్న రష్మి గౌతమ్.. వరుడు అతడేనా..?

రష్మి గౌతమ్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది సుడిగాలి సుదీర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఎన్ని సార్లు వీరిద్దరూ కలిసి ఎన్ని పర్ఫామెన్స్ లు ఇచ్చినా ఏ మాత్రం బోరు కొట్టకుండా ప్రేక్షకులను అలరిస్తూనే వుంటారు అని చెప్పడంలో సందేహం లేదు.. ముఖ్యంగా జబర్దస్త్ షో లో వీరి జోడి ఉంటుంది అంటే వీరి కోసమే ప్రేక్షకులు ఆ షో లను చూస్తారు . అంతలా వీరిద్దరి జోడి ప్రేక్షకులలో చొచ్చుకుపోయిందని చెప్పవచ్చు.

ఇక రష్మి గౌతమ్ తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టడమే కాకుండా బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతూ వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మీ ఏదైనా జంతువులకు హాని కలిగిందని తెలిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు.
ఇదిలా ఉండగా తాజాగా రష్మికి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ఇకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదలవ్వగా ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.

ఇందులో స్పెషల్ గెస్ట్ గా హీరో రాజశేఖర్ కూడా వచ్చారు l. ఇక జడ్జిలుగా ఇంద్రజ, శ్రద్ధ దాస్ రావడం జరిగింది. ఈ ప్రోమో లో వచ్చిన కమెడియన్ ఫైమా స్కిట్ చాలా అట్రాక్షన్ గా నిలిచింది. ఇక షో ఎండింగ్ లో యాంకర్ రష్మీ గౌతమ్ ని పెళ్లి కూతురు గా చూపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు .ముఖ్యంగా రష్మీ పక్కన పెళ్లి కొడుకుగా సుధీర్ ని చూపిస్తారు.. కానీ ఇప్పుడు చూపించే పెళ్ళికొడుకు గెటప్ మాత్రం చూపించడం లేదు. అంతే కాదు అతని మొహానికి మొత్తం మల్లె పూల పూలదండలతో కవర్ చేయడం జరిగింది .ఒకవేళ సుధీర్ పక్కన వేరే అమ్మాయి చూపించినా కూడా సర్ ప్రైజ్ లేకుండా ఆమెను చూపించేవారు.

ఇప్పుడు మాత్రం వెరైటీగా పెళ్లి కొడుకు మొహాన్ని చూపించడం లేదు. అయితే ఇలా పెళ్ళికొడుకు మొహానికి పూలతో కవర్ చేయడం వల్ల రష్మీ పెళ్లి నిజమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టిఆర్పి రేటింగ్ కోసం వాళ్ళు ఇలా చేసినా మొహం మాత్రం చూపెట్టేవారు కదా అని ప్రశ్నలు కూడా ఈ ప్రోమో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తలెత్తుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకూ ఎదురుచూడక తప్పదు.

Share post:

Popular