యశ్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన రష్మిక మందన్న… అసలు కథేంటి?

ప్రస్తుతం ఉన్న మీడియా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది తప్పును ఒప్పు చేయగలదు… ఒప్పును తప్పు చేయగలదు. అందుకే ఇప్పుడు సెలబ్రిటీలు కానీ… మరెవరైనా కానీ ఏదైనా తప్పు చేయాలంటేనే భయపడుతున్నారు. కొన్ని సార్లు ఇదే సోషల్ మీడియా సెలబ్రిటీలను హీరోగా చేస్తుంది..ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నిలువునా చీరేస్తుంది. అందుకే ప్రముఖులు అంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సార్లు ఎప్పుడూ జరిగిన వాటిని కూడా తవ్వి మరీ సెలెబ్రిటీల పరువు తీస్తుంది మీడియా.

ఇక సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొన్ని రకాల షోలకు హాజరవడం చూస్తూనే ఉంటాము. అయితే ఈ షో లలో భాగంగా యాంకర్ లు వారిని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఇవి ఎలా ఉంటాయి అంటే వారి వ్యక్తిగత జీవితం లేదా కొన్ని వివాదాలకు సంబంధించి ఉంటాయి. ఎంతసేపైనా యాంకర్ వారిని వివాదాలలోకి నెట్టడానికి ప్రయత్నిస్తు ఉంటారు. కానీ వారు అడిగిన ప్రశ్నలకు కంగారు పడి..లేదా అవేశ పడి నోరు జారారే అనుకో ఇక సోషల్ మీడియా వారిని ఒక రేంజ్ లో ఆడుకుంటుంది.

ఇక ఈటీవీ లవ్ ప్రతి శనివారం క్యాష్ అనే షో వస్తుంది. ఇందులో సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇందులో వచ్చే గెస్ట్ లను సుమ చాలా ప్రశ్నలు సరదాగా అడుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బంది పెట్టకపోయినా కొన్ని ప్రశ్నలు వారిని చిక్కుల్లో పడేస్తాయి. దీనికి ఒక ఉదాహరణ స్టార్ హీరోయిన్ రష్మీక మందన్న చిక్కుల్లో పడడం…

గత 5 సంవత్సరాల క్రితం హీరోయిన్ గా అంత ఫ్యామస్ కూడా కాని సమయంలో…ఇక కేజఎఫ్ స్టార్ హీరో యశ్ కు కూడా అప్పట్లో అంత క్రేజ్ లేదు. రస్మిక మరియు రక్షిత్ శెట్టి లు జంటగా నటించిన కిరాక్ పార్టీ అప్పుడు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటి రాష్మీక రక్షిత్ తో ప్రేమలో ఉంది. అయితే ప్రేమ ముదిరి పాకాన పడి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. అయితే ఏవో కారణాల వలన బ్రేక్ అప్ అయ్యి విడిపోయారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ జరిగే సమయంలో ఒక టీవీ షోలో యాంకర్ ఒక ప్రశ్న అడిగింది. రష్మీకను ఉద్దేశించి… మీ దృష్టిలో కన్నడ ఇండస్ట్రీలో మిస్టర్ షో ఆఫ్ ఎవరి అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు ఎటువంటి తడబాటు లేకుండా యశ్ అని సమాధానం చెప్పింది. ఆ సమాధానానికి యాంకర్ తో సహా షో చూస్తున్న ప్రేక్షకులు అంతా షాక్ అయ్యారు. నిజానికి యశ్ అలా ఏమీ ఉండడు..అన్నది లోకల్ టాక్. ఈ విషయం మీద అప్పట్లో సోషల్ మీడియాలో భారీగా రష్మిక ట్రోల్ కు గురైంది. అప్పుడు రష్మిక దీనికి వివరణగా…నేను షో లో చెప్పిన ఆ ఒక్క మాటనే హైలైట్ చేస్తూ విమర్శించడం కరెక్ట్ కాదు.. ఇంతకు ముందు యశ్ సార్ ని నేను ఎంతో పొగిడాను. ఆయనే నాకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది. ఆయన నటించిన సినిమాలు అనే నాకిష్టం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అంత చెప్పినా మీరు మారకపోతే… నన్ను క్షమించండి అంటూ ముగించింది.

Share post:

Popular